మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
అనుముల: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. అనుముల మండలం కొత్తపల్లిలో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై మంత్రి జగదీశ్‌రెడ్డిని నిలదీశారు. ప్రచారం ముందుకు సాగకుండా అడ్డుకున్నాడు. టీచర్ నిలదీతపై ఆగ్రహించిన మంత్రి ‘‘నీలాంటి వారిని చాలా మందిని చూశా. నీతో పాటు మీ నాయకులపై కఠినంగా వ్యవహరిస్తాం’’ అని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రైవేటు టీచర్‌ను పక్కకు లాక్కెళ్లడంతో జగదీశ్‌రెడ్డి ప్రచార వాహనం ముందుకు సాగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.