logo
Published : 27/11/2021 05:15 IST

యువతి అదృశ్యం

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: పెద్దకొండూరులోని ఓ ఆశ్రమం నుంచి ఓ యువతి(30) అదృశ్యం అయినట్లు శుక్రవారం కేసు నమోదైంది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో సఖీ కేంద్రం వారు ఓ యువతిని ఆశ్రమంలో చేర్పించారు. గురువారం ఉదయం ఆ యువతి ఆశ్రమం నుంచి తప్పిపోయినట్లు ఆశ్రమ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన యువతికి మాటలు రావని, తెలుపు రంగు దుస్తులు ధరించి ఉందని తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

చింతపల్లి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లిలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న మోతే భగవంత్‌(50) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మండలంలోని వింజమూరుకు భిక్షాటన కోసం కాలినడకన వెళ్లి రాత్రి తిరిగి చింతపల్లికి వస్తున్నారు. రోడ్డు వెంట నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి చేరుకోగానే రోడ్డు దాటే ప్రయత్నంలో అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భగవంత్‌ అక్కడికక్కడే మృతి చెందటంతో శరీరం రోడ్డుపై నుజ్జు నుజ్జయింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫి ర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.


 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని