logo
Published : 27/11/2021 05:15 IST

పటిష్ఠంగా ఉపాధి హామీ పథకం అమలు: డీఆర్డీవో

ఆత్మకూరులో మాట్లాడుతున్న డీఆర్డీవో ఎం.ఉపేందర్‌రెడ్డి

ఆత్మకూర్‌(ఎం), న్యూస్‌టుడే: పటిష్ఠంగా ఉపాధి హామీ పథకం అమలుపరుస్తూ, సక్రమంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని డీఆర్డీవో మందడి ఉపేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆత్మకూరు, మోటకొండూర్‌, ఆలేరు మండలాల్లో ఉపాధి హామీ పథకం, గ్రామీణ పారిశుద్ధ్యం, పల్లెప్రగతి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. డీపీవో సునంద, ఎంపీడీవోలు రాములు, వీరస్వామి, జ్ఞానప్రకాశ్‌, ఏపీవో పక్కిరయ్య తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట పట్టణం: ఉపాధిహామీ పథకం కింద రోజూ కనీసం 30 మందికి తగ్గకుండా కూలీలకు పనులు కల్పించాలని డీఎల్‌పీవో యాదగిరి, డీఆర్డీఏ ఏపీడీ శ్యామల సూచించారు. యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజపేట మండలాల ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, ఈసీ, టీఏలకు శుక్రవారం యాదగిరిగుట్టలో పంచాయతీరాజ్‌, ఉపాధిహామీ పనులపై నిర్వహించిన క్లస్టర్‌ స్థాయి సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీవోలు ప్రభాకర్‌రెడ్డి, ఉమాదేవి, రామరాజు పాల్గొన్నారు.

మోత్కూరు: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎల్పీవో యాదగిరి అన్నారు. మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం అమలుతీరుపై శుక్రవారం సమీక్ష జరిపారు. మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని