logo
Published : 27 Nov 2021 05:15 IST

వికృత చేష్టలను ‘వెనకేసు’కొచ్చిందెవరు..?

మేళ్లచెరువు, చింతలపాలెం, న్యూస్‌టుడే: జిల్లాలోని చింతలపాలెం మండలం తమ్మారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన సీహెచ్‌ అనిల్‌కుమార్‌ వికృత చేష్టలతో ఇటీవల అరెస్టు, సస్పెన్షన్‌కు గురయ్యారు. కానీ.. విచారణలో ఇతన్ని వెనకేసుకొచ్చిన వారి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యా, పోలీసు, ఐసీడీఎస్‌ అధికారుల విచారణలో పలు నిజాలు వెలుగు చూసినట్లు సమాచారం. అతనిపై ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించి మరిన్ని ఘటనలకు పాల్పడే అవకాశం ఆశాఖ అధికారులే కల్పించినట్లు ఆరోపణలున్నాయి. ఎనిమిదేళ్ల నుంచి ఒకే పాఠశాలలో పనిచేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలిసినా అక్కడే పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏమి చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడి ఎదుటే నిందితుడు అనిల్‌ విద్యార్థునులను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు చరవాణిలో తీస్తుంటే వారించలేదని ఆరోపిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడు రెగ్యులర్‌గా పాఠశాలకు వచ్చేవారు కాదని ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనిల్‌ ప్రవర్తనపై మిన్నకుండిపోయినట్లు అధికారుల విచారణలో తేలింది. నాలుగేళ్లుగా అనిల్‌ వికృత చేష్టలకు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం స్థాయిలోనే వాటిని కప్పిపుచ్చుతూ వచ్చినట్లు విచారణలో తేలింది. మూడేళ్ల కిందట నిందితుడు పక్కనే ఉన్న హైస్కూల్‌ పిల్లలను ఇలాగే గదిలోకి పిలుస్తుండటంతో ఆ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వారిని వారించారు. దీనిపై నిందిత ఉపాధ్యాయుడు, పిల్లలను రాకుండా అడ్డుకున్నా ఉపాధ్యాయుడిపై దాడి చేయించారని తేలింది. ఈ ఘటన బయటకు రాకుండా కాంప్లెక్స్‌ హెచ్‌ఎం చూసినట్లు వెలుగు చూసింది. స్థానికులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు పరిష్కారం చూపే విధంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని