logo
Published : 27 Nov 2021 05:15 IST

ఆవిష్కరణలు భళా

ఇన్‌స్పైర్‌ మానక్‌ పోటీల్లో యాదాద్రి, సూర్యాపేట జిల్లా విద్యార్థుల సత్తా

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ఇన్‌స్పైర్‌ మానక్‌ 2020-21 పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏటా ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి జిల్లాఫలోని వివిధ పాఠశాలల నుంచి 89 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వీరు రూపొందించిన ప్రాజెక్ట్‌లను ఈ ఏడాది అక్టోబరులో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో తొమ్మిది మంది ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కానుగుల నర్సింహ తెలిపారు. ఆ ప్రాజెక్ట్‌లకు మరింత మెరుగులద్ది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.

యాదాద్రిలో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రదర్శనలు ఇవే...

సురుపంగ స్వాతి(జడ్పీహెచ్‌ఎస్‌ చందుపట్ల, భువనగిరి) రూపొందించిన ప్రయాణికుల భద్రత వ్యవస్థ అనే ప్రాజెక్టు, శివరాత్రి స్నేహ(జడ్పీహెచ్‌ఎస్‌, యాదగిరిగుట్ట)-విపత్తుల్లో సజీవంగా ఉన్న వ్యక్తులను గుర్తించి వారి ప్రాణాలను రక్షించే పరికరం, కావ్య(మాంటిస్సోరి హైస్కూల్‌, రాజపేట)-ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ సమస్యలను అధిగమించడం, కడారి రమేష్‌(జడ్పీహెచ్‌ఎస్‌, అడ్డగూడూరు)-గ్రామాల్లో ఉదయాన్నే నడిచే వారికి మల్టీపర్పస్‌ స్మార్ట్‌షూస్‌, మెతుకు రామ్మోహన్‌‘(జడ్పీహెచ్‌ఎస్‌, అడ్డగూడూరు)-భవిష్యత్తులో పెద్ద దేవాలయాల్లో స్వయంచాలక ఆధునిక దర్శనాలు, సూరపల్లి రాహుల్‌(జడ్పీహెచ్‌ఎస్‌, సంస్థాన్‌నారాయణపురం)-స్వయంచాలక, బహుళార్ధసాధక ఆరోగ్య పంపిణీ, అన్నెబోయిన భవాని(ఆదర్శ పాఠశాల, బొమ్మలరామారం)-రైతుల ఇంటి వద్దనే తృణధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌, లక్ష్మీప్రసన్న(ఏకశిల హైస్కూల్‌, ఆలేరు)-రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు వాహనాల చోదకులకు స్లీప్‌ ఎనలైజర్‌, ధీరావత్‌ ప్రశాంత్‌( జడ్పీహెచ్‌ఎస్‌, చీకటిమామిడి, బొమ్మలరామారం) తయారు చేసిన కాలుష్య రహిత దోమల నివారిణి అనే ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

సూర్యాపేట(మహాత్మాగాంధీరోడ్డు): ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డ్సు 2020-21 రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి తొమ్మిది ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాని డీఈవో ఆశోక్‌ శుక్రవారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులు, ప్రాజెక్టుల వివరాలు ఇలా.. డి.రాకేష్‌ (ఏడోతరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, తిమ్మాపురం)- అగ్రికల్చర్‌ మిషన్‌, బి.దీపిక (తొమ్మిదోతరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, గరిడేపల్లి)- క్లీనోమీటర్‌, ఎ.ఆశోక్‌ (ఎనిమిదోతరగతి, టీఎస్‌ఎంఎస్‌, మునగాల)- స్పీడ్‌ డ్రిల్‌ విత్‌ బైస్కిల్‌, ఎన్‌.ఓంకారేశ్వరి (తొమ్మిదోతరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, యర్కారం)- సౌండ్‌ టు లైట్‌.. లైటు టు సౌండ్‌, జె.లాలుప్రసాద్‌ (తొమ్మిదోతరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, పాలవరం)- పేషెంట్‌ హెల్త్‌ అలర్ట్‌ వైర్‌లెస్‌ మానిటరింగ్‌, ఎం.శివానీ (తొమ్మిదోతరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, బాలెంల)- ఇన్నోవేటివ్‌ లీవరేజ్‌ సిస్టమ్‌, టి.అఖిల్‌ (పదోతరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, మునగాల)- టెండర్‌ ఓపెనింగ్‌ ఆఫ్‌ కోకనట్‌, ఎస్‌.స్వరూప (పదోతరగతి, జడ్పీహెచ్‌ఎస్‌, ఎర్రపహాడ్‌)- వాల్వ్‌క్యాప్‌ విత్‌ ప్రెసర్‌ సెన్సర్‌, వి.తేజశ్రీ (ఎనిమిదోతరగతి, టీఎస్‌ఎంఎస్‌, నేరేడుచర్ల)- రెస్క్యూఅలారమ్‌ అలర్ట్‌.


ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రదర్శిస్తున్న అన్నెబోయిన భవాని

అన్నదాతలకు భరోసా

బొమ్మలరామారం ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అన్నెబోయిన భవాని రైతులు తమ ఇంటి వద్దే తృణ ధాన్యాలను ప్రాసెసింగ్‌ చేసుకునే య ంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రాన్ని ఎక్కడికైన సునాయసంగా తీసుకెళ్లవచ్ఛు డెస్‌టోనర్‌, డీఈ హల్లర్‌, డీఈ హస్కర్‌ అనే పరికరాలను ట్రాలీలో అమర్చి యంత్రాన్ని తయారు చేసినట్లు భవాని తెలిపారు. డీసీ మోటారుతో పనిచేసే ఈ యంత్రంతో పొలం దున్నడంతో పాటు కలుపు తీయవచ్చని చెప్పారు.


స్వయంచాలక బహుళార్ధ సాధక ఆరోగ్య పంపిణీ పరికరాన్ని చూపుతున్న సూరపల్లి రాహుల్‌

బరువు తూచి.. ఎత్తు కొలిచి

సంస్థాన్‌ నారాయణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న సూరపల్లి రాహుల్‌ స్వయంచాలక బహుళార్ధ సాధక ఆరోగ్య పంపిణీ పరికరాన్ని తయారు చేశారు. దీని ద్వారా శరీర బరువు, ఉష్ణోగ్రత, పల్స్‌, ఆక్సిజన్‌ స్థాయిలతో పాటు ఆరోగ్య పరిమితులను కొలువవచ్ఛు ఆల్ట్రాసోనిక్‌ సెన్సార్‌ను వినియోగించి హ్యాండ్‌ శానిటైజర్‌నూ తయారు చేశారు. దీనితో చేతిపై శానిటైజర్‌ ద్రవాన్ని పూయవచ్ఛు బరువు తూచడానికి లోడ్‌సెల్‌, ఎత్తు కొలవడానికి ఐఆర్‌ సెన్సార్‌ ఉపయోగపడుతుందని రాహుల్‌ తెలిపారు. అన్ని ఫలితాలు ఎల్‌ఈడీ తెరపై చూసేలా రూపొందించినట్లు చెప్పారు.


స్వయంచాలక ఆధునిక దర్శనాల పరికరంతో మెతుకు రామ్మోహన్‌

ఒక్క పరికరం.. మూడు పనులు

కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అడ్డగూడూరు జడ్పీహెచ్‌ఎస్‌ పదో తరగతి విద్యార్థి మెతుకు రామ్మోహన్‌ స్వయంచాలక ఆధునిక దర్శనాల పరికరాన్ని తయారు చేశాడు. పెద్ద ఆలయాల్లో భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతోంది. భక్తులు భౌతిక దూరం పాటించేందుకు ఈ పరికరాన్ని దోహదపడుతుంది. దీనికి అమర్చిన ఆటోమేటెడ్‌ రొటెేటింగ్‌ యంత్రం నిర్దిష్ట వేగంతో తిరుగుతూ భక్తులపై ఆవిరి రూపంలో శానిటైజర్‌ చల్లుతుంది. యంత్రంలో చేయి పెట్టగానే ఆటోమెటిక్‌గా తీర్థప్రసాదాలు వచ్చేలా ఏర్పాటు చేశానని రామ్మోహన్‌ తెలిపాడు. ఒకే పరికరంతో మూడు పనులు చేపట్టవచ్చని వివరించారు.


Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని