logo
Published : 27/11/2021 05:15 IST

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి

భువనగిరిలో మొదలైన జ్ఞాన యుద్ధయాత్ర

భువనగిరిలో జ్ఞాన యుద్ధ యాత్రను ప్రారంభిస్తున్న వైతెపా రాష్ట్ర అధికార
ప్రతినిధి ఏపూరి సోమన్న, తదితరులు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని వైతెపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న అన్నారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి(సీీఏపీీఎస్‌ఎస్‌) జాతీయ అధ్యక్షుడు పరశురామ్‌ ఆధ్వర్యంలో పల్లె నుంచి దిల్లీ వరకు చేపట్టనున్న జ్ఞాన యుద్ధ యాత్రను భువనగిరి పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సగటు మనిషి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ‘ది ప్రాబ్లమ్‌ ఆఫ్‌ రూపీ‘ అనే పుస్తకాన్ని అంబేడ్కర్‌ రాసి నాటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి అందించడంతోనే ఆర్బీఐ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కరెన్సీ నోట్లపై ఫొటో ముద్రణ, గణతంత్ర వేడుకల్లో అంబేడ్కర్‌ ఫొటో ఉంచాలి, పార్లమెంటుకు, హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించే సచివాలయానికి అంబేడ్కర్‌ భవనంగా నామకరణం చేయాలి, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలనే డిమాండ్ల సాధనకు జ్ఞాన యుద్ధ యాత్ర చేపడుతున్న పరశురామ్‌ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల మీదుగా యాత్ర సాగి, ఏప్రిల్‌ 14న దిల్లీకి చేరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో సీీఏపీీఎస్‌ఎస్‌ జిల్లా ఛైర్మన్‌ కొడారి వెంకటేశ్‌, గౌరవాధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని