logo
Published : 27/11/2021 05:15 IST

సర్కారు బడులకు వరం విద్యాంజలి

నల్గొండ విద్యావిభాగం, భువనగిరి పట్టణం- న్యూస్‌టుడే

ర్కారు బడుల్లో మౌలిక వసతులను ప్రభుత్వం దాతల ద్వారా సమకూర్చనుంది. ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో రూపొందించిన విద్యాంజలి వెబ్‌సైట్‌లో పాఠశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 30వ తేదీలోపు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎన్ని పాఠశాలలు నమోదు చేసుకున్నాయో వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం.

సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం కొంత మేర సౌకర్యాలు కల్పిస్తున్నా పూర్తిస్థాయిలో చేయలేని పరిస్థితి. సమస్యల పరిష్కారానికి నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. ఏటా సమస్యలు పెరుగుతున్నా, ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినా నిధులు మంజూరు కావడం లేదు. ఒకవేళ ఎప్పుడో మంజూరైనా అరకొర మాత్రమే. మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంటగదులు, తరగతి గదులు, ప్రహరీలు, ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకొచ్చి తోడ్పాటు అందిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి.

వస్తు, ఆర్థిక రూపంలో సహకారం

దేశవ్యాప్తంగా ఉన్న దాతలు ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందించేందుకు ముందుకొస్తే కేంద్రప్రభుత్వం వారికి పాస్‌వర్డు లాగిన్‌ ఇస్తుంది. దాతలు తమకు నచ్చిన పాఠశాలలను ఎంచుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. దాతలు వస్తు, ఆర్థిక రూపంలోగాని సహకారం అందించే వెసులుబాటు ఉంది.

* నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు, ఆదర్శ, కస్తూర్బా విద్యాలయాలు మొత్తం 1528 ఉన్నాయి. విద్యాంజలి వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు 55 శాతం పాఠశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. విద్యాంజలి కింద రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను జిల్లా విద్యాశాఖాధికారి బి.భిక్షపతి, సెక్టోరియల్‌ అధికారి వీరయ్య పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 998 పాఠశాలల్లో 754 నమోదు చేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 744 పాఠశాలలకు 537 నమోదు చేసుకున్నాయి.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని