logo
Published : 27/11/2021 05:15 IST

యాదాద్రి ఆదాయ వృద్ధికి కసరత్తు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే

యాదాద్రిలోని బాలాలయం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆదాయం పెంపునకు కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో వ్యయభారం పెరగనుందని, జీతభత్యాల భారంతో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్వాహకుల ఆలోచన. ఇప్పటికే శ్రీ స్వామి, అమ్మవారల తొలి దర్శనం పేరిట పూల అలంకరణ, దైవకృప పొందేందుకు వేదాశీర్వచనం పర్వాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తోంది.

క్షేత్రాభివృద్ధిలో కొండపైన పునర్నిర్మితమైన హరి, హరుల ఆలయాల ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. మొక్కు పూజలతో పాటు శాశ్వత కైంకర్యాల ధరలు వృద్ధి చేయాలన్న భావనతో ఏ పూజకు ఎంత పెంచాలో కసరత్తు చేస్తున్నారు. పెరుగుతున్న ధరలు, జీతభత్యాలు, క్షేత్రాభివృద్ధిలో చేకూరిన వనరుల పోషణకు ఇప్పుడున్న ఆదాయం సరిపోదని అధికారులు చెబుతున్నారు. దేవుడి ఖజానాకు లోటు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యల అమలుకు దేవస్థానం నడుం బిగించింది. ఆ క్రమంలో పెంచే ధరలు ఈనెలాఖరు నుంచి అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది.

* ఆదాయం పెంచుకునేందుకు అప్పుడపుడు చేపట్టే యత్నాలలో 2013లో మే నెలాఖరు నుంచి నిత్య కల్యాణంలో కొనసాగుతున్న శ్రీ సుదర్శన హోమం పర్వాన్ని వేరు చేశారు. హోమం టికెట్‌ ధర రూ.1,116తో ఆ పూజను కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి నిత్య కల్యాణం రూ.1016 టికెట్‌ ధరను రూ.1250కు పెంచి నిర్వహిస్తున్నారు.

* ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలైన శాశ్వత పూజల నిర్వహణను పదేళ్లకే పరిమితం చేశారు. వీటి ధరలు పెంచేందుకు యోచిస్తోంది. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ అనుమతి పొందాకే పెంచిన ధరలు అమలు చేయనున్నారు. స్వామి, అమ్మవారలకు ఆరాధించే పూజలతో పాటు దేవుడి ప్రసాదాల ధరల పెంపునకు అధికారులు సిద్ధమవుతున్నారు. ధరల పెరుగుదలకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇటీవలే జారీ చేశారు.

ఈవో ఏమంటున్నారంటే..

పెరుగుతున్న ధరలు.. కొవిడ్‌ మహమ్మారితో తగ్గిన ఆదాయం దృష్ట్యా పూజలు, ప్రసాదాల ధరలు పెంచక తప్పడం లేదు. ఆలయ ఖజానాకు భారం పడకుండా ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకుంటున్నామని ఈవో గీత ‘న్యూస్‌టుడే’తో అన్నారు. ఆర్థిక లోటు దృష్ట్యా పెంచే ధరలపై భక్తులు సహకరించాలని కోరారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని