logo
Published : 27/11/2021 05:15 IST

కొలువుల ఆశ.. నిరుద్యోగులకు టోకరా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ కొలువుల ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపారు.. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉన్నాయని నమ్మించారు. మాయమాటలు చెప్పి వారి నుంచి రూ. లక్షల్లో వసూలు చేసి పరారీలో ఉన్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు నల్గొండ జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు.

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే

-ìల్గొండ జిల్లా కేంద్రంలోని సావస్కర్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారితో పాటు, హైదరాబాద్‌ స్థాయిలో ఐఏఎస్‌ అధికారులు పరిచయం ఉన్నారని బాధితులకు మాయమాటలు చెప్పారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన జానకిరెడ్డి, మునుగోడుకు చెందిన గిరీష్‌లు వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కొలువు కోసం రూ. 6 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా రూ. 2 లక్షల చొప్పున నగదు ఇద్దరు కలిసి రూ.4 లక్షలు మధ్యవర్తి సీహెచ్‌ భాస్కర్‌ ద్వారా చెల్లించారు. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన గిరి అనే యువకుడి భార్యకు ఏఎన్‌ఎం కొలువు కోసం రూ.1 లక్ష ఒప్పందం చేసుకుని రూ. 80 వేలు వసూలు చేసుకున్నాడు. రెండు నెలల క్రితమే నగదు వసూలు చేసుకున్న శ్రీనివాస్‌ పరారీలో ఉన్నారు. ఇటీవల వైద్యఆరోగ్యశాఖలో కొలువుల ఎంపిక పూర్తయినట్లు సమాచారం తెలుసుకున్న బాధితులు మోసపోయామని తెలుసుకుని వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు.

* ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ న్యాయమూర్తి వాహన డ్రైవర్‌ ఒకరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మా సారుకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని బాధితులను నమ్మించారు. పట్టణానికి చెందిన అర్జున్‌ అనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బంధువుకు వైద్యుడి కొలువు ఇప్పిస్తానని చెప్పి రూ. 2లక్షలు వసూలు చేశారు. వైద్యుల ఎంపిక ఇటీవల పూర్తి కావడంతో వాస్తవాలు తెలుసుకున్న బాధితుడు శుక్రవారం డీఎంహెచ్‌వో వద్దకు వచ్చి వాపోయారు. సమాచారం తెలుసుని నివ్వెరపోయిన సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వమని బాధితులకు సూచించారు.

విచారణ చేస్తున్నాం: బాలగోపాల్‌, సీఐ, వన్‌టౌన్‌

వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి బాధితుల వద్ద శ్రీనివాస్‌ నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులతో విచారణ చేస్తున్నాం. వాస్తవాలు పరిశీలించి కేసులు నమోదు చేస్తాం.

మాయమాటలకు మోసపోవద్దు

- డా. అన్నిమల్ల కొండల్‌రావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి, నల్గొండ

వైద్యఆరోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయి. మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు మోసవపోవద్ధు గుర్తు తెలియని వ్యక్తులు కొలువులు ఇప్పిస్తామని రూ. లక్షల్లో వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల వివరాలు, ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌తో పాటు కార్యాలయం గోడపై అంటించాం. అభ్యంతరాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించాం.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని