logo
Published : 29/11/2021 02:02 IST

పది నిమిషాలు.. 240 మంది బాలికలు

మూత్రశాలలు ప్రారంభించక పాట్లు

నిర్మాణం పూర్తయినా తెరచుకోని మూత్రశాలలు

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: విద్యార్థుల సంఖ్య ప్రకారం మూత్రశాలలు లేకపోవడంతో ఆత్మకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులుండగా.. వారిలో 260 మంది బాలికలున్నారు. పాఠశాలలో ప్రతి 40 మందికి ఒక మూత్రశాల యూనిట్‌ నిర్మించాలి. కానీ, ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో బాలికలకు రెండు, బాలురకు రెండు యూనిట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో బాలికలు రోజూ మూత్రవిసర్జనకు వరుసలో నిల్చుంటున్నారు. సమస్యను చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారు. కేవలం 10 నిమిషాల స్వల్ప విరామంలో 240 మందిమి ఎలా కృత్యాలు తీర్చుకోవాలని బాలికలు ప్రశ్నిస్తున్నారు. తాము తరగతికి వెళ్లే సరికి పాఠం అవుతోందని, గంటల తరబడి మూత్రాన్ని ఆపుకోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. బాలురు సమీపంలోని చెట్లపొదల్లోకి వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నారు.

ఎంబీ చేయక జాప్యం
ఈ పాఠశాలకు అదనంగా మరో రెండు మూత్రశాలు మంజూరయ్యాయి. సుమారు రూ.2.80 లక్షలతో జనవరి 2020లో నిర్మాణాలను గుత్తేదారు చేపట్టారు. అదే సంవత్సరం మార్చిలో కొవిడ్‌ ప్రభావంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2021 వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. మధ్యలో ఆర్వీఎం ఏఈ పనులను పరిశీలించి ఎంబీ చేయడంతో గుత్తేదారుకు సుమారు రూ.1.79లక్షలు చెల్లించారు. పూర్తయ్యాక ఎంబీ చేయక పోవడంతో సుమారు రూ.97 వేల బిల్లు నిలిచిపోయింది. దీంతో కొత్త మూత్రశాలకు గుత్తేదారు తాళం వేసుకున్నారు. ఎనిమిది నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ‘నిధులు పాఠశాల బ్యాంకు ఖాతాలో ఉన్నాయని, ఎంబీ చేయక పోవడంతో చెక్కును గుత్తేదారుకు ఇవ్వలేద’ని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని