logo
Published : 29/11/2021 02:02 IST

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి: విప్‌ సునీత

పెద్దపడిశాలలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

గుండాల, న్యూస్‌టుడే: అత్యున్నత రాజ్యాం గం రచించి.. సమ సమాజం స్థాపనకు కృషి చేసిన అంబేడ్కర్‌ ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో దళిత సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆదివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, జిల్లా కోఆప్టెడ్‌ సభ్యుడు ఖలీల్‌, ఉస్మానియా యూనివర్సిటీ డీన్‌ గాలి వినోద్‌కుమార్‌, హైకోర్టు అడ్వకేట్‌ అర్జున్‌, విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ జిల్లా నాయకులు అండెం సంజీవరెడ్డి, బీర్ల ఐలయ్య, వైఎస్‌ఆర్టీపీ నాయకులు ఏపూరి సోమన్న తదితరులు నివాళి అర్పించారు.

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం
గుండాల: కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినప్పటికీ వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గొంగిడి సునీత అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. మండల రైబస అధ్యక్షుడు గడ్డమీది పాండరి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని