logo
Published : 29/11/2021 02:02 IST

పూర్వీకుల ఆచారాలు గొప్పవి: మంత్రి

దురాజ్‌పల్లి వివేకానంద వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్తిక వనభోజనాల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

చివ్వెంల, న్యూస్‌టుడే: మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన ఆచారాలు ఎంతో గొప్పవని, వాటిని ఆచరించడం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి వద్ద గల వివేకానంద వృద్ధాశ్రమంలో సూర్యాపేట కిరాణా ప్యాన్సీ మర్చంÆట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తిక మాస వనభోజనాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాలానుగుణంగా మనం ఏం తినాలో, ఎలాంటి సంప్రదాయాలు పాటించాలో అనేక సంవత్సరాలుగా మన పూర్వీకులు కనుగొని చెప్పారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి గొప్ప ఆచారాలు అందించడం వల్లే నేడు ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. పుస్తకాల్లో ఎక్కడో రాసినవి కాకుండా ఆచారాలు, సంప్రదాయాల ద్వారా వచ్చిన అలవాట్లను భావి తరాల వారికి మన భారతీయ సమాజం అందిస్తుందని చెప్పారు. ఇలాంటి సంప్రదాయంగా వచ్చినదే కార్తిక వనభోజనాలన్నారు. అనంతరం ఇటీవల నూతనంగా సూర్యాపేట పట్టణ తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన సవరాల సత్యనారాయణను మంత్రి సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలంగా మారింది. కార్యక్రమంలో పురపాలిక ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మిడి లక్ష్మీనారాయణ, చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని