logo
Published : 29/11/2021 02:02 IST

హుజూరాబాద్‌ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టులాంటిది: ఈటల

సూర్యాపేటలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, పక్కన సంకినేని వెంకటేశ్వర్‌రావు

సూర్యాపేట గ్రామీణం: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజాపా గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంపపెట్టులాంటిదని, ఉద్యమకారులను అణిచివేయడానికే ఆయన కంకణంకట్టుకున్నారని మాజీమంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం  సూర్యాపేటలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాసంలో మాట్లాడారు. అసెంబ్లీలో ఈటెల రాజేందర్‌ మొహం కనిపించొద్దని, అక్రమంగా సంపాదించిన రూ.వందల కోట్లను హుజూరాబాద్‌ ఎన్నికలో కేసీఆర్‌ ఖర్చు చేశారని ఆరోపించారు. మద్యాన్ని లారీలలో దింపి గ్రామాల్లో ఏరులై పారించినా ప్రజలు తనను గొప్పమెజార్టీతో గెలిపించారన్నారు. అప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు భయంపుట్టుకొని ప్రజలకు మధ్యకొస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదని, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేని స్థితిలో తెరాస ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. గుత్తేదారులు అప్పులు చేసి పనులు చేస్తే ప్రభుత్వం డబ్బులు చెల్లించే పరిస్థితి లేక వారు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి దాపురించిందన్నారు.  రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిధులు లేక అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా కెసీఆర్‌ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే తెరాసలోకి వెళ్తారన్నారు. అనంతరం 18వ వార్డు నుంచి పలువురు భాజపాలో చేరారు. అనంతరం సంకినేని నివాసంలో జ్యోతిరావుపూలే చిత్రపటానికి నివాళి అర్పించారు.భాజపా జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, నాయకులు కడియం రామచంద్రయ్య, కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, వీరెంద్ర, గజ్జెల వెంకటరెడ్డి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌, వరుణ్‌రావు, రుక్మారావు, మన్మథరెడ్డి, నర్సింహ, ఉపేందర్‌, అబిద్‌, తదితరులు, పాల్గొన్నారు.
కోదాడ పట్టణం: కోదాడ పురపాలక కార్యాలయం ఎదుట అంబేడ్కర్‌, చాకలి ఐలమ్మ విగ్రహాలకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నివాళి అర్పించి మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకుముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి దళితుడికి రూ.10లక్షలు ఇవ్వాలన్నారు.  57 ఏళ్లు నిండిన వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్‌ పాల్గొన్నారు. అనంతరం ముదిరాజ్‌ కార్తిక వనభోజన మహోత్సవానికి ఈటల హాజరయ్యారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని