logo
Published : 29/11/2021 02:02 IST

ప్రపంచీకరణతో పర్యావరణ కాలుష్యం

ప్రొఫెసర్‌ రామచంద్రయ్య

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ రామచంద్రయ్య, చిత్రంలో రమణారెడ్డి, జగన్మోహన్‌రావు, రావుల వరప్రసాద్‌,

ప్రొఫెసర్‌ డాక్టర్‌ అందె సత్యం, డాక్టర్‌ రమాదేవి, కోయ వెంకటేశ్వర్లు, ఇంద్రారెడ్డి, శాంతికుమార్‌

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: వైజ్ఞానిక చర్చలు విస్తృతం చేసి ప్రజలకు శాస్రీˆ్తయ అంశాలపై అవగాహన పెంచాలని వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌ రామచంద్రయ్య అన్నారు. భువనగిరి పట్టణ శివారులోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో రెండ్రోజులపాటు జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. సభలకు ఆహ్వానితుడిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ప్రపంచీకరణ పేరుతో పలు వనరులు ధ్వంసమై పర్యావరణం కాలుష్యమవుతోందని, దీనికి మానవుడే కారణమన్నారు. వ్యవసాయంలో సేంద్రియ సేద్యం పెరగాలని, ఆహార భద్రతపై దృష్టి సారించాలని కోరారు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే వైజ్ఞానిక  అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చర్చల్లో వక్తలు అభిప్రాయపడ్డారు. సభలో పలు తీర్మానాలు ప్రతిపాదించి ఆమోదించారు. అనంతరం రాష్ట్ర కమిటీ, సబ్‌కమిటీల ఎన్నిక జరిగింది. సభల ఆహ్వాన అధ్యక్షుడు ఎలిమినేటి ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సభల్లో జేెవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ అందె సత్యం, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని