logo
Updated : 29/11/2021 13:58 IST

పగిలిన గాజులే పట్టించాయి

బ్యాటరీలు, మోటార్ల దొంగల గుట్టు రట్టు చేసిన దేవరకొండ పోలీసులు

చోరీకి పాల్పడిన నిందితులతో పాటు బ్యాటరీలను మీడియాకు చూపుతున్న దేవరకొండ సీఐ బీసన్న, పోలీసులు

దేవరకొండ, న్యూస్‌టుడే: జల్సాలకు పాల్పడుతూ ఈజీమనీ కోసం చోరీలకు పాల్పడుతున్న ముఠాను  పోలీసులు పట్టుకున్నారు. దేవరకొండ ఠాణాలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేవరకొండలోని ఎల్‌ఐసీ కార్యాలయం ముందు ఈ ఏడాది ఏప్రిల్‌ 10న పార్క్‌చేసిన లారీ, ట్రాక్టర్లలో మూడు బ్యాటరీలు చోరీకి గురవగా అప్పట్లో కేసు నమోదైంది. నవంబర్‌ 6, 17 తేదీల్లో చందంపేట మండలం గుంటిపల్లి శివారులోని మిల్లులో రెండు మోటార్లు, తెల్దేవరపల్లిలోని వెంకటేశ్వర రైస్‌మిల్లులో ఏడు మోటార్ల దొంగతనం జరగగా చందంపేట ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసుల వివరాలు డీఎస్పీ ఆనంద్‌రెడ్డి దృష్టికి రాగా.. ప్రత్యేక క్రైం టీంను ఏర్పాటుచేసి విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు.
దొంగతనం చేసింది మహిళలుగా భావించి..  దేవరకొండ క్రైం టీం చోరీ జరిగిన మిల్లు ఆవరణలను పరిశీలించగా అక్కడ గాజులు పగిలి ఉండడాన్ని బట్టి దొంగతనం చేసింది మహిళలుగా భావించారు. దేవరకొండలో ఏప్రిల్‌ 10న జరిగిన బ్యాటరీల చోరీలో ఆటోలో వచ్చింది మహిళలేనని, చందంపేట మండలంలో చోరీ చేసింది మహిళలే ఒక నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాలో ఆటో నెంబర్‌ గుర్తించి విచారించి కీలక సమాచారం సేకరించారు. నిందుతులను దేవరకొండ, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన జాని అలియాస్‌ సిరి, స్వరూప అలియాస్‌ గాయత్రి, లీలావతి, పద్మ, స్వామిగా గుర్తించారు. వీరిని ఆదివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ ఐదుగురు సభ్యులతో పాటు రాజేష్‌, ముని కలిసి చందంపేట మండలంలోని మిల్లుల్లో మోటార్ల దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిద్దరు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. వీరందరూ హైదరాబాద్‌లోని సింగరేణికాలనీలో నివాసముంటూ జల్సాలకు అలవాటుపడి  చోరీలకు పాల్పడ్డారన్నారు. సీఐ బీసన్న, ఎస్సైలు రామాంజనేయులు, నారాయణరెడ్డి, ట్రైనీ ఎస్సై మణికంఠరాజు, సిబ్బంది హేమనాయక్‌, శంకర్‌, శివ, అంజన్న పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని