logo
Published : 29/11/2021 02:02 IST

ట్రాక్టర్‌ చోదకుడి కుమారుడికి ఐఐటీలో సీటు

తాళ్లపల్లి వంశీ

నేరేడుచర్ల: పేద కుటుంబంలో జన్మించిన యువకుడు పట్టుదలతో శ్రమించి ఐఐటీ సీటు సాధించాడు. ఫార్మాస్క్యూటికల్‌ ఇంజినీరింగ్‌లో చేరినా సివిల్స్‌లో రాణించి ఐఏఎస్‌ కావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పెంచికల్‌దిన్న గ్రామానికి చెందిన తాళ్లపల్లి వంశీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఐఐటీలో ఫార్మాస్క్యూటికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో సీటు సాధించాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసే తాళ్లపల్లి జాన్‌, లక్ష్మి దంపతుల తనయుడు వంశీ. జేఈఈ మెయిన్స్‌లో 83 మార్కులతో 7 వేల ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్సుకు అర్హత సాధించి అందులో ఆలిండియా 2,869వ ర్యాంకు సాధించాడు. మొదటి రౌండ్‌లో జమ్మూకశ్మీర్‌లో సీటు వచ్చింది. కాని అందులో చేరలేదు. రెండో రౌండులో వారణాసిలో ఎస్సీ కోటాలో ఐఐటీలో సీటు రావడంతో అక్కడ చేరాడు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని