logo
Published : 29/11/2021 02:02 IST

అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసి ఆదివారం మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన నరేంద్రుని లింగమూర్తి కుమారుడు చిరుసాయి అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఎంఎస్‌ చదువుతున్నారు. చిరుసాయి డిసెంబర్‌ 15న ఇండియా రావడానికి ఏర్పాట్లు చేసుకొని భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి షాపింగ్‌ చేశారు. ఈ క్రమంలో తిరిగి రూముకి వస్తున్న సమయంలో తీవ్రంగా మంచు కురుస్తుండటంతో టిప్పర్‌ ఆయన ప్రయాణిస్తున్న కారుని వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిరుసాయి(22) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిరుసాయితోపాటు ప్రయాణిస్తున్న మరో యువతి కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కుమారుని మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు నరేంద్రుని లింగమూర్తి, సుధారాణి రోదనలు మిన్నంటాయి. తల్లి సుధారాణి రోదిస్తూ ఈ మధ్యే తన తనయుడు చిరుసాయి ఫోన్‌ చేశాడని, తన తండ్రికి 15జతల బట్టలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌రావు చిరుసాయి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి చిరుసాయి మృతదేహాన్ని త్వరితగతిన ఇండియాకి తీసుకొస్తామని హామీనిచ్చారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని