logo
Published : 29/11/2021 02:02 IST

సాంకేతికత తోడు.. ఉపాధి జోరు

కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీలో రాణిస్తున్న అతివలు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

టైలరింగ్‌ వృత్తిలో ఏళ్లుగా రాణిస్తున్న పలువురు మహిళలు సాంకేతికతను ఆకళింపు చేసుకుంటూ కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ ద్వారా మంచి ఉపాధి పొందుతున్నారు. నూతన యంత్రాల రాకతో పాటు తక్కువ ఖర్చులో వస్త్రాలపై రకరకాల డిజైన్లలో ఆకృతులు కుడుతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు మహిళలు ఈ కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. మగ్గం పనితో తయారు చేసే జాకెట్లు రూ.వెయ్యి నుంచి మొదలవుతుండగా.. వీటి జాకెట్లు కేవలం రూ.400 నుంచే అందుబాటులో ఉండడంతో పేద, మధ్య తరగతి మహిళలు సైతం వీటిని తయారు చేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ యంత్రాల ద్వారా ఉపాధి పొందుతున్న పలువురు మహిళల అభిప్రాయాలు ఇవీ..


సీరియల్‌ నటీమణులూ కుట్టించుకున్నారు
- చల్లమల సందీపారెడ్డి, మిర్యాలగూడ

రోనాకు కొద్ది రోజుల ముందు రూ.3లక్షలతో కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ యంత్రాన్ని ఏర్పాటు చేశాను. కరోనాతో వ్యాపారం అంతగా లేనప్పటికీ ఇటీవల కొద్దిగా పుంజుకుంది. నూతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తూ సొంతంగా డిజైన్లు తయారు చేస్తాను. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తాను. అవి చూసిన అనేక మంది ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ ఇస్తున్నారు. ఇటీవల సీరియల్‌ నటీమణులు జ్యోతిరెడ్డి, శృతి వంటి వారితో పాటు అనేక మందికి జాకెట్లపై డిజైన్లు చేసి ఇచ్చాను. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు హైదరాబాద్‌కు చెందిన అనేక మంది జాకెట్లు ఆర్డ¢ర్‌ ఇస్తున్నారు. టర్కీ టవల్‌ వంటి మందమైన వస్త్రాలు మినహాయించి.. మిగతా అన్ని రకాల వస్త్రాలపై డిజైన్లు వేస్తాం.


ఎనిమిదో తరగతిలోనే  నేర్చుకున్నా..
- చొల్లేటి పద్మ, చౌటుప్పల్‌

నిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచే టైలరింగ్‌ నేర్చుకున్నాను. 18 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్పు చెందాలనే ఉద్దేశంతో ఏడు నెలల క్రితం రూ.4 లక్షలతో రెండు కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ యంత్రాలను తీసుకొచ్చాను. యంత్రాలు సమకూర్చిన సంస్థ వారే కంప్యూటర్‌లో శిక్షణ ఇచ్చారు. దీని ద్వారా నెలకు రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది. చౌటుప్పల్‌తో పాటు కేసారం, తంగెడపల్లి వంటి చుట్టు పక్కలవారు జాకెట్లు కుట్టించునేందుకు వస్తుంటారు. వివాహ ముహూర్తాలు అధికంగా ఉన్న సమయాల్లో గిరాకీ బాగుంటుంది. సాధారణ మహిళలు సైతం శుభకార్యాల్లో డిజైనర్‌ జాకెట్లు ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.


30 ఏళ్లుగా టైలరింగ్‌ వృత్తి
- మొరిశెట్టి లక్ష్మి, సూర్యాపేట

ముప్పై ఏళ్లుగా టైలరింగ్‌ వృత్తిలో ఉన్నాను. ఇటీవల మహిళలు డిజైనర్‌ జాకెట్ల వైపు మొగ్గు చూపుతుండడంతో నా భర్త సహకారంతో నాలుగేళ్ల క్రితం రూ.2.50 లక్షలతో కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ యంత్రం తీసుకొచ్చాను. కంప్యూటర్‌ పని నేనే చేస్తాను. ఇతర పనుల కోసం ఇద్దరు మహిళలున్నారు. నాకున్న కస్టమర్ల ద్వారా తెలుసుకుని.. సూర్యాపేటతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా వినియోగదారులు వస్తుంటారు. సీజన్‌లో నెలకు రూ.40వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ యంత్రం ద్వారా తయారు చేసే జాకెట్లు మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండడంతో వివాహాది శుభకార్యాల్లో గ్రామీణ ప్రాంతాల వారు సైతం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని