logo
Published : 29/11/2021 02:54 IST

పోటాపోటీగా ఆర్యవైశ్య ఎన్నికలు

జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వనమా వెంకటేశ్వర్లును అభినందిస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు

నల్గొండ కల్చరల్‌, న్యూస్‌టుడే: ఆర్యవైశ్య మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా వనమా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఉత్కంఠŸగా ఎన్నికలు జరిగాయి. పదవి దక్కించుకోవడానికి ఎవరికి వాళ్లు పోటా పోటీగా ప్రయత్నాలు చేశారు. అధ్యక్ష పదవికోసం 11 మంది నామపత్రాలు దాఖలు చేయగా.. చివరకు నల్గొండకు చెందిన వనమా మనోహర్‌, చిట్యాలకు చెందిన వనమా వెంకటేశ్వర్లు బరిలో నిలిచారు. మహాసభ రాష్ట్ర కమిటీ సూచనల ప్రకారం రామగిరిలోని ఆర్య వైశ్యభవన్‌లో  ఎన్నికలు నిర్వహించారు. 500 మంది ఓటు వేయాల్సి ఉండగా 287 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనోహర్‌కు 85 ఓట్లు రాగా.. వెంకటేశ్వర్లుకు 202 ఓట్లు వచ్చాయి. 117 ఓట్ల మెజార్టీతో చిట్యాలకు చెందిన వనమా వెంకటేశ్వర్లు గెలుపొందారని ఎన్నికల నిర్వాహకుడు చింతల రవి తెలిపారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన వెంకటేశ్వర్లు తెలిపారు.

పోరాటాలతో సమస్యల పరిష్కారం
నీలగిరి కల్చరల్‌, న్యూస్‌టుడే: నిరంతర ప్రజా పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి సూచించారు. ఆదివారం జరిగిన సీపీఎం పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేస్తూ పోరాటాలు నిర్వహించడం ద్వారానే వ్యవసాయ చట్టాలను రద్దు చేయించుకున్నామనానరు. ఆ విధంగానే సమస్యల పరిష్కారంలో నిర్వహించే పోరాటాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. సయ్యద్‌ హషం, ఎండీ.సలీం, దండంపల్లి సత్తయ్య, కుంభం కృష్ణారెడ్డి, గాదె నర్సింహా, అద్దంకి నర్సింహా, భూతం అరుణకుమారి పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని