logo
Published : 29 Nov 2021 02:54 IST

నిరుద్యోగులకు టోకరాపై అప్రమత్తమైన అధికారులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు టోకరా వేస్తున్న అక్రమార్కుల పట్ల పోలీస్‌శాఖతో పాటు వైద్యఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అమాయకులను మోసం చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నవారిని గుర్తించి కఠిన చ6ర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో కొండల్‌రావు ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు నియామకాలు చేపట్టిన వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎం, కాంటిజెంటర్‌ వర్కర్లు ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నవారికి వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఒకరిద్దరి అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నిఘా విభాగాలు గర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు బాధితులు ఉద్యోగాల కోసం రూ.9 లక్షలకు పైగా దళారులకు ఇచ్చి మోసపోయినట్లు గుర్తించారు. ఉద్యోగాల కోసం డబ్బులు ఖర్చు చేసుకుని మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని వన్‌టౌన్‌ సీఐ బాలగోపాల్‌ తెలిపారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని