logo
Published : 29/11/2021 02:54 IST

పక్కగా సాగు లెక్క

రబీ పంట పొలాలకు జియో ట్యాగింగ్‌

దుక్కి దున్నుతున్న రైతు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తాజాగా యాసంగి(రబీ) సాగు పంట పొలాలకు జియో ట్యాగింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీని కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రైతులు పండించే పంటల వివరాలను అన్‌లైన్‌లో పక్కగా పొందుపరుస్తారు. వెరసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చేతికొచ్చే దిగుబడుల సమాచారం లెక్కలు తేడా లేకుండా పక్కాగా ఉంటాయి.
జిల్లాలో యాసంగిలో సుమారు 5లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుందని ఆధికారుల అంచనా. తాజాగా రబీ సాగు పనులు మొదలైనందన క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు పరిశీలించేదుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పొలాల బాట పట్టనున్నారు. ధాన్యం తేమ శాతం పనులు ఉన్నందున ఆత్మ ఎటీఎం, బీటీఎంలను కూడా ఈ పనులకు నియమించారు. మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు నమూనాగా రెండు గ్రామాల్లో 40 సర్వే సంఖ్యల్లో పొలాలను, జిల్లా వ్యవసాయ అధికారి 20 సర్వే సంఖ్యల్లో పొలాలను కచ్చింతంగా సందర్శించేందుకు ఖరారు చేశారు. పొలాల్లోనే ట్యాబ్‌లతో ఫొటోలు తీసి అక్షాంశ, రేఖాంశాల అధారంగా అక్కడి నుంచి పంట, విస్తీర్ణం, సాగు ప్రారంభించిన తేదీ వంటి వివరాలను క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌లో నమోదు చేసేందుకు సాంకేతితను వినియెగించనున్నారు. వివరాలను క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా పరిశీలించేందుకు ఉద్యాన, సీపీఓ కార్యాలయం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాలను నియమించారు. తప్పుడు, పొరపాటు వివరాలు నమోదు చేసినట్లు తేలితే ప్రత్యేక బృందం అధికారులు బాధ్యులపై చర్యలకు సిఫారసు చేయనున్నారు. విస్తరణ అధికారులకు నియెజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వాహించి అవగాహన కల్పించారు.

కలిగే ప్రయోజనాలు..
అధికారులు ఒక చోట కూర్చొని సాగు వివరాలు నమోదు చేసే విధానానికి స్వస్తి పలకనున్నారు. దీంతో సరైన వివరాల నమోదుకు వీలుంటుంది. పారదర్శకత ఏర్పడనుంది.
ఏయే దిగుబడులు ఎంత మేర వస్తాయో మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ శాఖ అంచన వేయడం సులభతరం అవుతుంది.
దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు, అవసరమైన గోనె సంచుల సరఫరా, రైతులకు చెల్లించే మద్దతు ధరకు అనుగుణంగా నిధుల కేటాయింపులపై స్పష్టత వచ్చి ప్రభుత్వం ముందస్తుగా సన్నద్ధం అవుతుంది.
రైతుల నుంచి కొనుగోలు చేసిన దిగుబడులు, ఉత్పత్తిల కోసం అవసనమైన గోదాములను అందుబాటుల్లో ఉంచేందుకు మార్గం సుగమం అవుతుంది.

మార్పిడిపై విస్తృత ప్రచారం..
జనాభాకు సరిపడా బియ్యం నిల్వలు ఉండటంతో వరికి బదులు ప్రత్యామ్యాయ పంటలు సాగుకు ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ పంటల మార్పిడి విధానాన్ని అమలు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మినుము, వేరుశెనగ, శెనగ, పెసర, కంది, నువ్వులు, కూరగాయల సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. రాయితీపై ఉమ్మడి జిల్లాలో 1300 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు రైతులకు అందించారు. విత్తనాభివృద్ధి సంస్ధద్వారా ఆరుతడి పంటల విత్తనాలను పూర్తి ధరపై పీఏసీఎస్‌, ఎన్‌డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు.


పకడ్బందీగా అమలు చేస్తాం
-శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, నల్గొండ

ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నాం. జియో ట్యాగింగ్‌ విధానం అమలు చేయడం ద్వారా రైతులు పండించే పంటలు, విస్తీర్ణం వివరాలు పక్కాగా తెలుస్తాయి. యాసంగి పంటలు ఇప్పుడిప్పుడే సాగు చేస్తున్నారు. ఏఈవోలు ధాన్యం కేంద్రాలలో తేమ శాతం చూస్తున్నారు. దీనితోపాటు పంటల వివరాలను ఆన్‌లైన్‌లో పక్కాగా పొందుపరచనున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని