logo
Published : 29/11/2021 02:54 IST

అధికారి సంతకం ఫోర్జరీ చేసిన సర్పంచి

చర్యలకు సిఫారసు చేసిన డీసీవో

చండూరు, న్యూస్‌టుడే: నెర్మట సర్పంచి నర్సిరెడ్డి చండూరు రైతు సేవా సహకార బ్యాంకు నోడ్యూస్‌ సర్టిఫికేట్‌ పైన సీఈవో సంతకాన్ని ఫోర్జరీకి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహకార బ్యాంకులో బకాయి ఉన్నప్పటికీ ఆయన స్థానిక ఏపీజీవీబీలో పంట రుణం తీసుకోవాలని చూశారు. నోడ్యూస్‌ ధ్రువపత్రం కావాల్సి రావటంతో సహకార బ్యాంకు సీఈవో వెంకటేశ్వర్ల సంతకాన్ని దర్జాగా ఫోర్జరీ చేశారు. కానీ ఏపీజీవీబీ బ్యాంకు వారు దాన్ని గుర్తించి సహకార బ్యాంకు అధికారులకు తెలిపారు. నెర్మట గ్రామానికి చెందిన బురకల వెంకటేశ్‌ ఈ విషయాన్ని జిల్లా సహకార అధికారి ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణకు ఆదేశించటంతో ఫోర్జరీ నిజమే అని తేలింది. సదరు వ్యక్తిపై పోలీసు ఠాణాలో కేసు పెట్టాలని చండూరు సేవా సహకార బ్యాంకు ఛైర్‌ పర్సన్‌కు ఆయన సిఫారసు చేస్తూ 15న లేఖ పంపించారు. జిల్లా సహకార అధికారి ప్రసాద్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా చర్యలు తీసుకునే తుది నిర్ణయం చండూరు రైతు సేవా సహకార బ్యాంకు వారిపై ఉంటుందని తెలిపారు. మరి బ్యాంకు వారు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఫోర్జరీ విషయం బయటికి తెలియటంతో సర్పంచి నర్సిరెడ్డి చండూరు రైతు సేవా సహకార బ్యాంకుకు బకాయి పడిన రూ.2.20 లక్షలు డబ్బులను చెల్లించారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని