logo
Published : 29/11/2021 02:54 IST

సంఘటితంతో సాకారం

సర్వేలులో కంది పప్పు మిల్లులో నిర్వాహకులు

చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, న్యూస్‌టుడే: సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని రైతులు సంఘటితమై వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీని 2018లో స్థాపించారు. ఇందులో 18 గ్రామాలకు చెందిన 542 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు రూ.1,000 చొప్పున వాటా ధనం రూ.5,42,000 సమకూర్చుకున్నారు. ‘సంస్థాన్‌ నారాయణపురం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌’కు ‘నాబార్డు’ రూ.9.50 లక్షలు, జీఐజడ్‌ (జర్మనీ సంస్థ) రూ.10 లక్షలు గ్రాంటుగా ఇచ్చాయి.


కంది పప్పు వ్యాపారం

లింగమోనిగూడెంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో అన్నదాత ఇంటి వద్దకే ఎరువుల బస్తాలు

రైతుల నుంచి సేకరించిన రూ.3 లక్షలు, వాటర్‌షెడ్‌ ఎంట్రీ పాయింట్‌ నిధులు రూ.1 లక్ష, విత్తనోత్పత్తి ద్వారా వచ్చిన రూ.1.50 లక్షలతో పప్పు మిల్లును సర్వేలులో ఏర్పాటు చేశారు. మెట్ట ప్రాంతం కావడంతో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా పరిశోధన సంస్థ నుంచి కంది మూల విత్తనాన్ని తెచ్చి కర్షకులకు సరఫరా చేశారు. 400 క్వింటాళ్ల కందులను వారి నుంచి కొన్నారు. మిల్లులో పప్పుగా మార్చారు. సొంత బ్రాండ్‌ పేరుతో అమ్మకాలు చేశారు. రూ.1.50లక్షలు లాభం సంపాదించారు.


సమస్యలు సొంతంగా పరిష్కరించుకోవాలనే...
-పల్లె పుష్పారెడ్డి, ఛైర్మన్‌, సంస్థాన్‌ నారాయణపురం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌

మా ప్రాంతంలో నీటి వనరులు సరిగా లేక, తగిన దిగుబడి రాక, గిట్టుబాటు ధర అందక రైతులు ఇబ్బందులు పడేవారు. వాటర్‌షెడ్‌ కార్యక్రమం మా ప్రా ంతంలో అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని ‘రైతు స్వయం సహాయక సంఘాలు’ ప్రారంభించాం. ప్రతినెలా కొంత పొదుపు చేయడం వల్ల ఐక్యతతో పాటు అవసరమైన వారికి సహాయం చేయడానికి అవకాశం
ఏర్పడింది.


ధాన్‌ ఫౌండేషన్‌ సహకారం

‘ధాన్‌ ఫౌండేషన్‌’ అనుసంధానంతో ‘రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  
1. రైతు స్వయం సహాయక సంఘాలు
70 స్వయం సహాయక రైతు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. నెలకు రూ.100 పొదుపు చొప్పున బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేస్తున్నారు. ఒక్కో సంఘంలో రూ.10వేల నుంచి రూ.3లక్షల వరకు రివాల్వింగ్‌ నిధి పోగైంది. మధురైలోని కళంజియన్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (కేడీఎఫ్‌ఎస్‌)లో రైతు స్వయం సహాయక సంఘాలు రూ.5వేల చొప్పున జమచేసి ఖాతాదారులుగా చేరాయి. రైతులు పొదుపు చేసుకున్న మొత్తానికి నాలుగైదు రెట్లు అధికంగా 18శాతం వడ్డీతో కేడీఎఫ్‌ఎస్‌ రుణాలిస్తోంది. పంటకాలాన్ని బట్టి 24వాయిదాల్లో అప్పు తిరిగి చెల్లిస్తున్నారు.


2. జల, భూసంరక్షణ, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు
సర్వేలు, గుజ్జ, మల్లారెడ్డిగూడెం, గొల్లగూడెంలలో 3000 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.60 కోట్ల ప్రభుత్వ నిధులతో 2009లో జల, భూసంరక్షణ, సమగ్ర నీటి యాజమాన్య కార్యక్రమాలు చేపట్టారు. 2018-19లో పూర్తి చేశారు.  


3. సామాజిక భద్రత కార్యక్రమాలు
సంఘంలో సభ్యత్వమున్న అన్ని కుటుంబాలకు రూ.200 చొప్పున జీవిత బీమా చేయించారు. ఆరోగ్యబీమా, పంటల బీమా, పశువులు, జీవాలకు బీమా చేయించారు.


4. సాంఘిక భద్రతకు..
ఆరోగ్యంపై, మద్యపానంతో జరిగే నష్టంపై అవగాహన కల్పిస్తున్నారు. మద్యానికి బానిసైన వారిని గుర్తించి రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపిస్తున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులు, అరికలు, కొర్రలు పండించి సభ్యుల కుటుంబాలు వాటిని తినేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ‘నాబార్డు’ రుణం రూ.10 లక్షలతో సర్వేలులో ‘రూరల్‌ హాట్‌’ (రైతు సంత) నిర్మాణం చేశారు.  


5. అభివృద్ధి, నైపుణ్య శిక్షణ
వ్యవసాయ ఉత్పాదకత పెంపుదలకు నార్మ్‌, కేవీకే, నాబార్డు, ఉపాధిహామీ పథకం నిపుణులతో రైతులకు శిక్షనిప్పిస్తున్నారు. మూల విత్తనాల సరఫరా, క్షేత్ర పర్యటనలు చేస్తున్నారు. నేరుగా కంపెనీ నుంచి యూరియా కొని రైతులకు సరఫరా చేస్తున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని