బాలల రక్షణకు పటిష్ఠ చర్యలు: అదనపు కలెక్టర్
కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న దివ్యాంగులు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: బాలల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ మోహన్రావు అన్నారు. బాధిత బాలల తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున తక్షణ ప్రోత్సాహక చెక్కులను కలెక్టరేట్లో సోమవారం అందజేశారు. డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, బాలరక్ష భవన్ సమన్వయకర్త ఆర్.వెంకటలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు, రైతులకు సూచించారు. డీఎస్వో విజయలక్ష్మి, డీఏవో రామారావునాయక్, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరిష పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.