logo
Published : 30 Nov 2021 04:12 IST

యాదాద్రిలో భక్తుల సందడి

నిత్య ఆదాయం రూ.24.96 లక్షలు

యాదాద్రిలో వత్రాలు నిర్వహిస్తున్న భక్తులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తిక సోమవారం ఆధ్యాత్మిక ప్రత్యేకత నెలకొంది. అన్ని మాసాలలో కన్నా కార్తికమాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మాసంలో ప్రతీరోజూ విశేషమైందే. సోమవారం అత్యంత విశేషమైన రోజు. హరి హరులకు ప్రీతికరమైన రోజు క్షేత్ర సందర్శన, హరి హరుల దర్శనం, వ్రతాల నిర్వహణ, దీపారాధనలు చేపట్టడంతో ముక్తి ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని పలు జిల్లాలకు చెందిన భక్తులు సోమవారం సందర్శించి కార్తిక మొక్కులు తీర్చుకున్నారు. శ్రీలక్ష్మీనారసింహుల నిత్యకల్యాణం, నిజాభిషేకం, హోమాది పర్వాలలో భక్తులు అధికంగా పాల్గొని ఆశీస్సులు పొందారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలలోనూ భక్త దంపతులు 934 మంది జంటలు పాల్గొని సదరు పూజలు చేపట్టారు. ఈ వ్రతాలతో ఆలయానికి రూ.2.67 లక్షలు చేకూరాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాలో రూ.24.96 లక్షలు చేకూరినట్లు ఈవో గీత తెలిపారు.

* కొండ కింద పాతగోశాల ప్రాంగణంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. కుటుంబ సంక్షేమాన్ని ఆశిస్తూ పలువురు భక్తులు కుటుంబ సభ్యులతో దీపారాధన చేపట్టారు.

* కార్తిక చివరి సోమవారం సందర్భంగా కొండపై శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి సన్నిధిలో ఆలయ ఈవో గీత దీపోత్సవాన్ని చేపట్టారు. సంప్రదాయ పరంగా రామలింగేశ్వరస్వామికి పూజారులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిళ్వార్చనలు నిర్వహించారు.

ఆలయ స్వర్ణ విమానానికి విరాళాలు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమానానికి స్వర్ణకవచం తయారీలో భాగస్వాములం కావాలని భక్తులు ముగ్గురు వేర్వురుగా విరాళాలను ఈవోకు సోమవారం అందజేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నవతేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యజమాని యాదగిరి రూ.5,00,449ల చెక్కును ఈవో గీతకు తన కుటుంబ సభ్యులతో కలిసి ముట్టజెప్పారు.

* యాదగిరిగుట్ట నివాసి సుడుగు జీవన్‌రెడ్డి రూ.1,00,116ల చెక్కును, ఈ ఆలయ ఉప ప్రధాన పూజారి సురేందరాచార్య రూ.11,116ల చెక్కు అందజేశారు.

యాదాద్రీశుల సేవలో ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్‌ కమిషనర్‌ బుద్ద మురళీ కుటుంబ సభ్యులతో సందర్శించారు. కార్తిక సోమవారం సందర్భంగా క్షేత్ర సందర్శనకు వచ్చిన ఆయన కొండపై గల బాలాలయంలోని పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తులను దర్శించుకున్నారు. సువర్ణ పుష్పార్చన జరిపించారు. అనంతరం అధికారులు దేవుడి ప్రసాదం, అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని