logo
Published : 30 Nov 2021 06:31 IST

చిత్రమేరా ఆశయం

సూర్యాపేటలో నటులకు సన్నివేశాన్ని వివరిస్తున్న రావుల రాధాకృష్ణ

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: చిత్రసీమలో రాణించాలనే లక్ష్యంతో మొదట లఘుచిత్రాలు తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన యువకుడు రావుల రాధాకృష్ణ. సినిమాలు చూస్తూ పెరిగిన అతడు.. డైరెక్షన్‌ విభాగంలో రాణించాలనే కోరికతో సందేశాత్మక చిత్రాలు.. ప్రైవేటు ఆల్బమ్‌లు చిత్రీకరిస్తున్నారు. కొన్ని లఘుచిత్రాలు బాగుండటంతో రాధాకృష్ణ యూట్యూబ్‌ ఛానల్‌ ‘సూర్యాపేట ట్యూన్స్‌’కు వేలాది మంది సబ్‌స్క్రైబర్లుగా మారారు. పాటలు కూడా అదే రీతిన అతడికి పేరు తెచ్చిపెట్టాయి. ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న లఘుచిత్రాలు, పాటల ద్వారా రాధాకృష్ణకు ఆదాయం వస్తోంది.

సందేశాత్మకం చిత్రాలు తీస్తా..

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన రావుల రాధాకృష్ణ బాల్యంలోనే డైరెక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నారు. తదనంతరం స్నేహితుల సహాయంతో లఘుచిత్రాలు, జానపద, సంక్రాంతి, తదితర పండగల పాటలు చిత్రీకరించారు. యూట్యూబ్‌లో ఛానల్‌ ‘సూర్యాపేట ట్యూన్స్‌’ ఏర్పాటుచేశారు. ఈ ఛానల్‌కు ఇప్పటివరకు పది వేల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరు చేసిన స్వేచ్ఛ అనే చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. 2020 బతుకమ్మ పండుగ సందర్భంగా చిత్రీకరించిన పాటలో గాయకురాలు కనకవ్వ నటించారు. ఈ పాటను మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. రాధాకృష్ణ చిత్రీకరించిన వివిధ పాటలు ప్రేక్షకాదరణ పొందడంతో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆయన ఎంపికయ్యారు. సందేశాత్మక చిత్రాలతో డైరెక్షన్‌లో రాణిస్తానని, స్టార్‌ హీరోలతో సినిమాలు తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని రాధాకృష్ణ చెబుతున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని