logo
Published : 02/12/2021 05:47 IST

బలహీనవర్గాల గొంతుకగా చరిత్రలో నిలిచిపోయారు..

నర్సింహయ్య, రామ్మూర్తియాదవ్‌ విగ్రహావిష్కరణలో మంత్రి జగదీశ్‌రెడ్డి

నర్సింహయ్య విగ్రహావిష్కరణలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భగత్‌, తదితరులు

నిడమనూరు, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌ వారీ తుదిశ్వాస వరకూ బడుగు, బలహీన వర్గాల పక్షాన అపెంబ్లీలో పోరాడి ప్రజా గొంతుకలుగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా నిడమనూరు మండలం వేంపాడ్‌ స్టేజీ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్‌ ఏర్పాటు చేసిన నర్సింహయ్య, రామ్మూర్తియాదవ్‌ విగ్రహాలను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభావేదికపై మంత్రి మాట్లాడుతూ సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి కేవలం రామ్మూర్తి యాదవ్‌, నోముల నర్సింహయ్య హయాంలోనే జరిగిందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన నర్సింహయ్య ఆశయాలను సాధించేలా ఎమ్మెల్యే భగత్‌ ముందుకు సాగాలన్నారు. నెల్లికఫ్ట్‌ లిఫ్ట్‌ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయని, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఎమ్మెల్యే భగత్‌ మాట్లాడుతూ తన తండ్రి నర్సింహయ్యతో పాటు రామ్మూర్తియాదవ్‌ల ఆశయ సాధనే లక్ష్యంగా అనునిత్యం ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచంద్రానాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రనాయక్‌, శానంపుడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, స్థానిక సంస్థల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిలు మాట్లాడుతూ నర్సింహయ్య, రామ్మూర్తియాదవ్‌ల సేవలను గుర్తచేస్తూ కొనియాడారు. స్థానిక ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్‌ విరిగినేని అంజయ్య, తదితరులతో పాటు నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రూపు రాజకీయాలకు చరమగీతం పాడండి: గుత్తా
సభా వేదికపై ఎమ్మెల్సీ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నర్సింహయ్య హఠాన్మరణం అనంతరం భగవంతుడి ఆశీర్వాదంతో చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా భగత్‌కు అవకాశం వచ్చిందనందుకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని కాంక్షించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చి సీఎం కేసీఆర్‌ మాట నెలబెట్టుకున్నారన్నారు. ఇక నుంచి గ్రూపు రాజకీయాలకు చరమగీతం పాడి అన్నదమ్ముల్లా కలిసుండాలని సూచించారు.

 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని