logo
Published : 02/12/2021 05:57 IST

అభిరుచికి తగ్గట్టు... అలంకరణతో ఆకట్టు

నల్గొండ జిల్లాపరిషత్‌, న్యూస్‌టుడే

పెళ్లి వస్తువుల అలంకరణ

వివాహ మహోత్సవంలో ప్రాచీన కాలం నుంచి పెళ్లి కుండలు, గరిక ముంత, సాన, కాడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా లేటెస్ట్‌ ప్యాషన్‌తో బోనం, పెళ్లి కుండలు కనుల విందు చేస్తున్నాయి. పెయింటింగ్‌ చేసిన కుండలకు మార్కెట్‌లో ఇప్పుడు మంచి క్రేజ్‌ ఉంది. మహిళా డిజైనర్లు సైతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్తోమతను పెంచుకుంటున్నారు. మరో పక్క తమ నైపుణ్యాన్ని ఇనుమడింప చేస్తూ వివాహ మహోత్సవం తంతు ప్రతిష్ఠనూ పెంచుతున్నారు  నీలగిరి మహిళలు. ప్రజలు ఇష్టపడే విధంగా డిజైన్‌ వర్క్‌ మురిపించే ఎంబ్రాయిడరీలతో ఎన్నో కొత్త మోడళ్లతో ఆవిష్కృతమవుతున్నాయి. వధు, వరుల హుందాతనాన్ని పెంచే డిజైన్లు.. మురిపిస్తున్న ముత్యాలతో అలంకరించిన పెళ్లి కుండలు నేటి తరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పెరుగుతున్న మక్కువ.. మస్తు గిరాకీ
పెళ్లికి హాజరైన పెద్దలు, బంధు, మిత్రుల నుంచి కొబ్బరి కుడకలో పుస్తే మెట్టలు ఉంచి ఆశీర్వాదం తీసుకునే హిందు సాంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పుడూ ఆ కుడకలను సైతం ముత్యాలు, చెమ్కీలతో అలంకరిస్తున్నారు. అదే విధంగా వధు, వరుడు ఒకరి కాలివేలు మరొక్కరు తొక్కేందుకు ఉపయోగించే సానరాయిని సైతం ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పెళ్లికూతురు, కుమారుని చేతిలో ఉండే గరికే ముంత, అవురేని కుండలు సైతం రంగు రంగుల అలకంరణతో చెమ్కీలు, ముత్యాలతో డిజైన్‌ చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. ప్రస్తుతం వీటిపై ప్రజల్లో మక్కువ పెరిగింది. చెమ్కీలు, చిప్స్‌తో అలంకరించి ఎంబ్రాడరీ వర్క్‌తో తీర్చిదిద్దిన కుండలకు మంచి గిరాకీ ఏర్పడింది. డిజైన్‌ బట్టి పెళ్లి వేడుకలో ఉపయోగించే వస్తువుల అలంకరణకు రూ. 7వేల నుంచి రూ.15వేల వరకు తీసుకుంటున్నారు. వీటిని ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, మార్కెట్‌ ఫ్లస్‌, ఈ-కామర్‌్్స ద్వారా ఆర్డర్లు ఇచ్చిన వారికి సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పెళ్లి తంతులో ఉపయోగించే వస్తువులు సేకరించి వాటికి అలకరించడం ద్వారా డిజైనర్‌తోపాటు ఇతరులకు సైతం ఉపాధి లభిస్తోంది.


 

ఇష్టపడి  నేర్చుకున్నా..

గాదె రమ్య, నల్గొండ
పెళ్లి తంతులో ఉపయోగించే వస్తువుల అలంకరణ ఇష్టంతో నేర్చుకున్నా. తమ్ముడు పెళ్లికి డిజైన్‌ వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా దొరకలేదు. దీంతో తామే ఎందుకు తయారు చేయకుడదూ అనే ఆలోచన అప్పుడే వచ్చింది. తనలో ఉన్న సృజనాత్మకతతో కుండలకు పెయింటింగ్‌ వేసి చెమ్కీ, చిప్స్‌తో అలకంరించాను. అందరూ నన్ను అభినందించారు. పెళ్లికి వచ్చిన బంధు,మిత్రులు చూసి తమకు కూడా తయారుచేసి ఇవ్వాలని కోరారు. అప్పటి నుంచి ఇతరులకు ఆర్డర్లపై తయారు చేసి విక్రయిస్తున్నా. బంధువులు, మిత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. వారికి తోడు ఫేస్‌బుక్‌, వాట్సాఫ్‌ , మార్కెట్‌ఫ్లస్‌ ద్వారా తను తయారు చేసి వస్తువుల ఛాయచిత్రాలు పోస్టు చేశా. చూసిన వారంతా వారి అవసరాన్ని బట్టి ఆర్డర్లు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. వీటి ద్వారా కుటుంబ ఆర్థిక  పరిస్థితులు మెరుగు పడ్డాయి.


15 ఏళ్లుగా డిజైన్‌
- కొయగూర అండాలు, నల్గొండ

వివాహ మహోత్సవంలో ఉపయోగించే కుండలు, ఇతర వస్తువులకు అలంకరణ గత 15 ఏళ్లుగా చేస్తున్నా. అంతకు మట్టితో వినాయ ప్రతిమలను చేసి విక్రయించే వాళ్లం.  ఆ తర్వాత అవురేని కుండలకు జాజు, సున్నంతో ముగ్గులు అలంకరించా. మరుతున్న కాలంలో ప్రజల అభిరుచికి తగ్గట్టు కొత్తగా రంగులు ఉపయోగించి సరికొత్త హంగులతో ఆవురేని కుండలు, భోనం కుండల అలంకరణ ప్రారంభించాను. నాతోపాటు నా కూతురు కూడా కుండలకు ఆకర్షణీయంగా పేయింటింగ్‌ వేస్తూ సహకరిస్తుంది. 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని