logo
Published : 02/12/2021 05:57 IST

పేదింట ఉషస్సు

 తండ్రి మరణంతో ఆటో స్టీరింగ్‌ పట్టిన యువతి


ఆటో నడుపుతున్న ఉషారాణి

భువనగిరి, న్యూస్‌టుడే: కళాశాలకు వెళ్లి తోటి విద్యార్థులతో సంతోషంగా గడుపుతూ.. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేయాల్సిన వయస్సులో తండ్రి మరణం ఆ యువతి జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారిగా కష్టాల సుడిగుండంలోకి నెట్టింది.. ఇంటికి పెద్ద కూతురు కావడంతో కుటుంబ బాధ్యతలు ఆమెపైనే పడ్డాయి. అయినా భయకుండా ధైర్యంగా ముందడుగు వేశారు. కుటుంబాన్ని పోషించేందుకు పుస్తకాలు పట్టుకున్న చేతులతోనే.. ఆటో స్టీరింగ్‌ పట్టుకున్నారు. ఓ వైపు చెల్లిని చదివిస్తూ.. తానూ చదువుతూ.. మరోవైపు కుటుంబ భారం మోస్తూ అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు... పిన్నం ఉషారాణి.

చిచ్చుపెట్టిన జలాశయ పరిహారం
భువనగిరి మండలం బీఎన్‌తిమ్మాపురానికి చెందిన పిన్నం సతీష్‌, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉషారాణి, సారిక. తండ్రి సతీష్‌ ఆటో నడిపేవారు. ఆ గ్రామ సమీపంలో నిర్మించిన బస్వాపురం(నృసింహ) జలాశయంలో ముంపునకు గురవుతున్న పొలానికి నష్టపరిహారం ఇవ్వలేదని ఈ ఏడాది మే లో సతీష్‌ తన ఆటో కాల్చి.. తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన మృతితో భార్యాపిల్లలు వీధినపడ్డారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆ కుటుంబానికి పెద్దకుమార్తె ఉషారాణి పెద్ద దిక్కైంది. సరదాగా నేర్చుకున్న ఆటోనే ఆమెకు జీవనాధారమైంది. తన చెల్లి సారికను స్థానికంగా ఏడో తరగతి చదివిస్తూ.. తానూ భువనగిరి నవభారత్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ బతుకుబండి సాగిస్తున్నారు. ఫైనాన్స్‌లో తీసుకొన్న ఆటోలో రోజూ ప్రయాణికులను ఎక్కించుకొని కళాశాలకు వస్తారు. సాయంత్రం కళాశాల అయిపోయాక మళ్లీ తిరిగి గ్రామానికి ప్రయాణికులను తీసుకెళ్తారు. సెలవుల్లో రోజంతా ఆటో నడుపుతారు. ఇలా రోజూ రూ. 200 నుంచి రూ.300 వరకు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఉద్యోగాలు రావడంలేదని ఖాళీగా ఉంటున్న యువతకు ఉషారాణి ఆదర్శంగా నిలుస్తున్నారు.


 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని