logo
Published : 02/12/2021 05:57 IST

ఉన్నతికి శ్రీకారం.. శిక్షణకు ఊతం

బాలభవన్‌గా మారిన సూర్యాపేట బాలకేంద్రం

సూర్యాపేటలో బాలభవన్‌

సూర్యాపేట సాంస్కృతికం, న్యూస్‌టుడే: చిన్నారుల సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలభవన్‌, బాలకేంద్రాలు దోహదపడతాయి. సూర్యాపేట బాలకేంద్రంలో తర్ఫీదు తీసుకునే విద్యార్థుల సంఖ్య అధికం. చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో బాలభవన్‌గా మార్చాలని బాలభవన్‌ డైరెక్టర్‌కు ఇక్కడి నిర్వాహకులు అనేకసార్లు ప్రతిపాదనలు పంపించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట బాలకేంద్రాన్ని బాలభవన్‌గా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. జవహర్‌ బాలకేంద్రం కాస్త బాలభవన్‌గా మారింది.

రాజ్‌భవన్‌లో ఐదుసార్లు నృత్య ప్రదర్శనలు..
సూర్యాపేట బాలకేంద్రానికి చెందిన విద్యార్థులు రాజ్‌భవన్‌లో ఐదుసార్లు నృత్యప్రదర్శనలు నిర్వహించారు. ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు. పలుచోట్ల బాలకేంద్రం చిన్నారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కళాఉత్సవ్‌ పోటీల్లోనూ రాణిస్తున్నారు.

బాలభవన్‌ డైరెక్టర్‌ ద్వారా బడ్జెట్‌ కేటాయింపు
బాలకేంద్రం బాలభవన్‌గా మారటంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాలకేంద్రానికి బడ్జెట్‌ అంటూ ఉండేది కాదు. ఛైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ ప్రత్యేక నిధులు కేటాయించేవారు. పట్టణంలోని దాతల సహకారంతో సిబ్బందికి వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు వెళ్లేవి. బాలకేంద్రం బాలభవన్‌గా మారటంతో బాలభవన్‌ డైరెక్టర్‌ నుంచి ప్రతినెలా విద్యుత్తు, నీటి బిల్లులు, అడ్మినిస్ట్రేషన్‌ తదితర వాటికి బడ్జెట్‌ కేటాయిస్తారు. సిబ్బందికి నిర్దిష్టమైన పే స్కేల్‌ వర్తించనుంది.


త్వరగా నిర్మాణం చేపట్టాలి -కీర్తిక, సూర్యాపేట

 

బాలకేంద్రాన్ని బాలభవన్‌గా మారటం సంతోషంగా ఉంది. త్వరగా బాలభవన్‌ నిర్మాణం చేపట్టాలి. లలిత కళలపై ఆన్‌లైన్‌ ద్వారా బాలకేంద్రం ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతున్నాను. శిక్షణ బాగుంది.
ఆనందంగా ఉంది  


-బార్మవత్‌ కీర్తన, సూర్యాపేట
బాలకేంద్రంలో ఇస్తున్న శిక్షణ బాగుంది. బాలకేంద్రం బాలభవన్‌గా మారటం ఆనందంగా ఉంది. బాలభవన్‌లో లలిత కళలకు సంబంధించిన ఆటవస్తువులు, నృత్య సామాగ్రి అందుబాటులో ఉండనున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు ముగిసిన వెంటనే నేరుగా బాలభవన్‌లో శిక్షణ తీసుకుంటాను.


కల నెరవేరింది  -వనమా వెంకటరామయ్య, సామాజిక వేత్త
ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. సూర్యాపేట పట్టణంలో బాలకేంద్రాన్ని ఏర్పాటు చేసి చిన్నారులకు ఉచిత శిక్షణ అందాలన్నదే నా ఆశయం. 1980 మార్చి 23న అప్పటి కలెక్టర్‌ రాజారెడ్డి సమక్షంలో సూర్యాపేటలో బాలకేంద్రాన్ని మిత్రుల సహాయంతో ఏర్పాటు చేశాం. నాటి నుంచి మిత్రుల సహాయంతో చిన్నారులకు శిక్షణ అందిస్తూ వచ్చాం. ఇటీవల బాలకేంద్రం సూపరింటెండెంట్‌గా వచ్చిన బండి రాధాకృష్ణారెడ్డి, ఇతర సిబ్బంది కృషి వల్లే బాలకేంద్రం బాలభవన్‌గా రూపుదిద్దుకుంది.


రూ.50లక్షలు మంజూరయ్యాయి
-బండి రాధాకృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌, బాలభవన్‌

సూర్యాపేట పాత ఆర్డీవో కార్యాలయంలోని 22 గుంటల స్థలంలో బాలభవన్‌ నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి గతంలోనే రూ.50లక్షలు మంజూరు చేశారు. పట్టణ నడిబొడ్డున బాలభవన్‌ నిర్మిస్తే శిక్షణకు చిన్నారులు ఉత్సాహం చూపే అవకాశం మెండుగా ఉంది. బాలభవన్‌లో లలిత కళలపై తర్ఫీదుకు సామగ్రి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌ శిక్షణ కొనసాగుతోంది.




 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని