logo
Published : 02/12/2021 05:57 IST

వాటర్‌షెడ్‌ పథకం వివరాల సేకరణకు సర్వే

సర్వే పుస్తకాలను ఆవిష్కరిస్తున్న జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బి.మాన్యానాయక్‌, సిబ్బంది

భువనగిరి, న్యూస్‌టుడే: వాటర్‌షెడ్‌ పథకం వివరాల సేకరణకు సర్వే చేపడుతున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బి.మాన్యానాయక్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని జిల్లా కార్యాలయంలో సర్వేను ప్రారంభించి గణాంక అధికారులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. గతంలో చేపట్టిన వాటర్‌షెడ్‌ పథకాలు, ప్రస్తుత వాటి పరిస్థితి, లబ్ధిపొందినవారి వివరాలు, సాగవుతున్న భూమి తదితర వివరాలను ప్రభుత్వం సూచించిన నమూనా పట్టిక ప్రకారం సేకరించాలని ఆయన కోరారు. వలిగొండ, మోత్కూరు, ఆత్మకూరు, చౌటుప్పల్‌ మండలాల్లో బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు చేపడుతామన్నారు. వాటర్‌షెడ్‌ కమిటీలు, స్వయం సహాయక సంఘాలు సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల గణాంక అధికారులు ఉప ప్రణాళిక అధికారులు, డీఆర్డీఏ పీవోలు శిక్షణలో పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని