logo
Published : 02/12/2021 05:57 IST

ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్‌

సూర్యాపేట: దూర దృశ్య శ్రవణ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, తదితరులు

సూర్యాపేట కలెక్టరేట్‌: జిల్లాలో ఈ నెల 10న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఓటరు నమోదు, గరుడ యాప్‌ వినియోగంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ హైదరాబాద్‌ నుంచి బుధవారం నిర్వహించిన దూర దృశ్య శ్రవణ సమీక్ష సమావేశానికి అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుతో కలిసి సూర్యాపేటలో హాజరయ్యారు. జిల్లాలో ఓటరు జాబితాను త్వరితగతిన రూపొందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లు తప్పనిసరిగా రెండు డోసులు వాక్సినేషన్‌ తీసుకుని ఉండాలన్నారు. ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు, ఏవో శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట కలెక్టరేట్‌: జిల్లాలో ఈ నెల చివరి వరకు అర్హులందరికీ టీకా అందేలా కృషి చేస్తామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌, తదితర అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన దూర దృశ్య శ్రవణ సమీక్ష సమావేశానికి సూర్యాపేటలో హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,44,455 మందికి మొదటి డోసు, 2,91,519 మందికి రెండు డోసులు ఇచ్చినట్లు వివరించారు. అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, జడ్పీ సీఈవో సురేష్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటాచలం, డీఆర్డీవో కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య, డీఈవో అశోక్‌, డీఐవో డాక్టర్‌ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
మునగాల: ఉపాదిహామీ పథకంలో రోజువారీ కూలీల హాజరును పెంచాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ అన్నారు. మునగాలలో మునగాల నడిగూడెం మండలాల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై బుధవారం సమీక్ష జరిపారు. డీఆర్డీవో సుందరి కిరణ్‌కుమార్‌, జడ్పీ సీఈవో సురేష్‌, ఇన్‌ఛార్జి డీపీవో శ్రీరాములు, ఎంపీడీవోలు వెంకటేశ్వర్లు, ఎర్రయ్య, ఎంపీవోలు భూపాల్‌రెడ్డి, లింగారెడ్డి, ఏపీవోలు శేఖర్‌, వెంకన్న పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని