logo
Published : 02/12/2021 06:03 IST

నిబంధనలు తుస్సు.. పొంచి ఉన్న ముప్పు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కొవిడ్‌ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 4329 పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా పరిధిలోని బీసీ వసతి గృహాలు, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మినహా మూడు జిల్లాల పరిధిలో 448170 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది ఉన్నారు. కొద్ది నెలలుగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను తెరిచి విద్యార్థులకు ఆశ్రయం కల్పించారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికి క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం, నిబంధనలకు అనుగుణంగా వసతి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో తరగతి గదుల్లో భౌతిక దూరం సాధ్యపడటం లేదు. బెంచీకి ఒకరిని కూర్చోబెట్టాలన్న నిబంధన అటకెక్కింది. సరిపడా థర్మల్‌ స్కానర్లు సరఫరా చేయని కారణంగా స్కానింగ్‌ ప్రక్రియ మచ్చుకైనా కన్పించడం లేదు. శానిటైజర్ల కొరత నెలకొంది. స్కూల్‌ గ్రాంటు నుంచి నియంత్రణ చర్యలకు ప్రధానోపాథ్యాయులు డబ్బులు వినియోగిస్తున్నారు. ఇవి సరిపోవడం లేదు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి రావాలన్న నిబంధన సంపూర్ణంగా అమలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సంక్షేమ వసతి గృహాల్లో భౌతిక దూరం పాటించి వసతి కల్పించే పరిస్థితులు లేవు. అద్దె భవనాల్లో అసౌకర్యాల నడుమ కొన్ని సంక్షేమ వసతి గృహాలు కొనసాగుతున్నాయి.


అప్రమత్తత అవసరం
- కానుగంటి నర్సింహ, జిల్లా విద్యాశాఖాధికారి, భువనగిరి

పాఠశాలల్లో కరోనా నియంత్రణ నిబంధనలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేశాం. ఇప్పటి వరకు భువనగిరి జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. ఈ విషయమై అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరాం. అందరూ చేతులు శానిటైజేషన్‌, మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపడ్తున్నాం.


 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని