logo
Published : 03/12/2021 03:13 IST

ఆలేరు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ యూనిట్‌


సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు, న్యూస్‌టుడే: ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఐసీయూ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు. ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఐసీయూ యూనిట్‌ను నెల రోజుల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు డీసీహెచ్‌ఎస్‌కు లేఖను రాశామన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతమైన మోటకొండూరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని స్వచ్ఛంద సంస్థ సహకారంతో 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.

రెండు నాల్కల ధోరణి సరికాదు
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎమ్మెల్యే సునీత అన్నారు. భాజపా నాయకులు రెండు నాల్కల ధోరణిని అవలంబించడం సరికాదన్నారు. రైతుల కళ్లాల వద్దకు వెళ్లి కన్నీరు కార్చడాన్ని మానుకొని కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్‌ గడ్డమీది రవీందర్‌, వైస్‌ ఛైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్‌, కోటగిరి, ఆంజనేయులు,పాల్గొన్నారు.

బస్సులు పునరుద్ధరించాలి
యాదగిరిగుట్ట పట్టణం: జిల్లాలోని వివిధ గ్రామాలకు నడిచిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, సమయానుకూలంగా నడపాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఇటీవల విద్యార్థులు బస్సుల కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గురువారం యాదగిరిగుట్టలో డీఎం లక్ష్మారెడ్డి, సిస్టమ్‌ సూపర్‌వైజర్‌ ఎల్లయ్యతో చర్చించారు. గుండాల నుంచి బండ కొత్తపల్లి వరకు వయా ఆదర్శ పాఠశాల వెళ్లే విధంగా, యాదగిరిగుట్ట నుంచి సీతారాంపురం, ఆలేరు నుంచి కాజీపేట వరకు వయా దూది వెంకటాపురం, సాయిగూడెం మీదుగా, చిన్నలక్ష్మీపురం నుంచి భువనగిరి వరకు వయా ధర్మారం, పల్లెపహాడ్‌, ఆదర్శ పాఠశాల, భువనగిరి నుంచి తేరాల వయా చందెపల్లి, చాడ గ్రామాలు, చాడ నుంచి వలిగొండ వయా నాంచారిపేట, కదిరేనిగూడెం గ్రామాల వరకు గతంలో ఉన్న సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలన్నారు. విద్యార్థులకు చదువులకు ఆటంకం కలగకుండా చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ రవీందర్‌, నాయకులు కర్రె వెంకటయ్య, పెలిమెల్లి శ్రీధర్‌ పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని