logo
Published : 03/12/2021 03:13 IST

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులకు నష్టం


తుక్కాపురంలోని కొనుగోలు కేంద్రంలో మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని తుక్కాపురం పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షాలకు తడిసి మొలకెత్తిందని, కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్లనే రైతులు నష్టపోతున్నారన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ధాన్యం తడవడం, ఆరబోయడం కోసం అయ్యే ఖర్చులతోపాటు పంటలకు చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో నాయకులు కోట పెద్ద స్వామి, నాయకులు బింగి బిక్షపతి, ఆదినారాయణ, పాక వెంకటేశ్‌, రత్నపురం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని