logo
Published : 03/12/2021 03:13 IST

పశు సంపద వృద్ధికి ప్రభుత్వం కృషి: బొల్లం


శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

చిలుకూరు: ఆయకట్టు ప్రాంతంలో పశుసంపదను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గర్భకోశ వ్యాధుల వైద్యశిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తిలో ఉన్నతిని సాధించాలనే లక్ష్యంతో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కస్తూరి నర్సయ్య, గోపాలమిత్రలు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ప్యాక్స్‌ నుంచి రాయితీపై మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసులు, ఇన్‌ఛార్జి సర్పంచి కొడారు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యురాలు రమణ పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని