logo
Published : 03/12/2021 03:13 IST

నారసింహుడికి శత ఘటాభిషేకం


శ్రీ స్వామి, అమ్మవారల నిత్యకల్యాణం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం ప్రత్యేక అభిషేకంతో స్తంభోద్భవుడైన నారసింహుడిని ఆరాధించారు. స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా బాలాలయంలో ఉగ్ర నరహరి జయంతి వేడుకను అష్టోత్తర శత ఘటాభిషేకంతో నిర్వహించారు. తొలుత 108 కలశాలకు ప్రత్యేక ఆరాధన నిర్వహించి పంచామృతంతో కలశాలలో నింపిన జలం, పంచామృతాలతో ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. రాత్రి ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలతో ఆలయానికి రూ.3,58,500 చేకూరాయి. వివిధ విభాగాల ద్వారా నిత్యాదాయం 18.73 లక్షలు జమైనట్లు ఈవో గీత తెలిపారు. పాతగుట్ట ఆలయంలోనూ స్వాతి పూజలు చేపట్టారు. శతఘటాభిషేకం నిర్వహించి స్వాతి జయంతి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పాల్గొన్న భక్తులు

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని