logo
Published : 04/12/2021 04:19 IST

వ్యవసాయ, విద్యుత్తు రంగాల్లో సంక్షోభానికి భాజపా కుట్ర: మంత్రి


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌, బీజేపీదేనని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశం పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్‌ ఖ్యాతి దిల్లీ వరకు పాకిందని అది ఓర్వలేకే రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతుంటే రాష్ట్రంలోని భాజపా నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ రైతులను గందరగోళ పరుస్తున్నారన్నారు. శాసనమండలి ఎన్నికల్లోనూ అదే చైతన్యాన్ని చాటేందుకు ఓటర్లు సన్నద్ధం కావాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ జడల అమరేందర్‌, పుర అధ్యక్షుడు ఎనబోయిన ఆంజనేయులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని