logo
Published : 04/12/2021 04:19 IST

హరితహారం కార్యాచరణను సిద్ధం చేయండి: కలెక్టర్‌


చౌటుప్పల్‌లోని అనాథాశ్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

భువనగిరి, న్యూస్‌టుడే: తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా 2022-23, 2023-24 సంవత్సరాలలో మొక్కలు నాటేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్‌, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, రోడ్లు భవనాలు, ఎక్సైజ్‌, మున్సిపల్‌శాఖ అధికారులతో గూగుల్‌మీట్‌ ద్వారా శుక్రవారం సమీక్షించారు. జిల్లా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రెండు, మూడు రోజుల్లో రూపొందించాలన్నారు. ప్రతి శాఖ తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేపట్టాలని, అవెన్యూ ప్లాంటేషన్లు పెద్ద మొక్కలతో సిద్ధం చేయాలని తెలిపారు. గూగుల్‌మీట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా ఎక్సైజ్‌ అధికారి కృష్ణప్రియ, జిల్లా ఉద్యానవన అధికారి, జిల్లా రోడ్లు భవనాలశాఖ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేపట్టాలి

బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని, రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం బీబీనగర్‌ మండలం రాఘవాపురం, రుద్రవెల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు విధానాలను పరిశీలించారు. తేమ, తూకం యంత్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ట్యాబ్‌ ఎంట్రీ వెంటనే పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కనకదుర్గ రైసు మిల్లును సందర్శించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా లారీల నుంచి ధాన్యం వెంటనే అన్‌లోడ్‌ అయ్యే విధంగా చూడాలని, యాసంగి సీఎంఆర్‌ మిల్లింగ్‌ పూర్తిచేయాలని మిల్లు ప్రతినిధులకు సూచించారు. రహీంఖాన్‌గూడ, జలాల్‌పురంలోని శ్మశాన వాటిక, నర్సరీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, సివిల్‌ సప్లై డీఎం గోపి కృష్ణ, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందిస్తాం

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలన్నీ అమలు చేసి వారికి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. చౌటుప్పల్‌లోని అమ్మానాన్న మానసిక వికలాంగుల అనాథల పుణ్యక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనాథాశ్రమంలోని సోమనాథ క్షేత్రంలో పూజలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. అనాథలకు, దివ్యాంగులకు ఆసరా పింఛను అందనట్లయితే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. అనాథాశ్రమం నిర్వాహకుడు గట్టు శంకర్‌ను అభినందించారు. ఆర్డీవో ఎస్‌.సూరజ్‌ కుమార్‌, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖాధికారి కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యశోద, డాక్టర్‌ ప్రశాంత్‌, డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి, ఎంపీవో అంజిరెడ్డి, సీడీపీవో శైలజ, సీహెచ్‌వో చంద్రశేఖర్‌, హెచ్‌ఈ వసంతకుమారి పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని