logo
Published : 04/12/2021 04:54 IST

దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి


మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి వెలిగించి ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయిలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించి పరిష్కార మార్గం చూపుతున్నట్లు తెలిపారు. దివ్యాంగుల పట్ల వివక్ష చూపకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో దివ్యాంగుల చట్టం పూర్తి స్థాయిల్లో అమలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఐసీడీఎస్‌ పీడీ సుభద్ర మాట్లాడుతూ దివ్యాంగుల హక్కులకు భంగం కలగకుండా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తున్నట్లు తెలిపారు. అనంతరం దివ్యాంగుల క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందజేశారు. దివ్యాంగుల సమానత్వం కోసం వారిని వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ప్రోత్సాహం, ప్రతి నెల రూ.3,016 ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీవో పీడి కాళిందిని, డీసీహెచ్‌ఎస్‌ మాతృనాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అరుంధతి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌ తదితరులు

పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని