logo
Published : 04/12/2021 04:54 IST

సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ భాజపా విఫలం: మంత్రి జగదీశ్‌రెడ్డి


నకిరేకల్‌: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా, ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్‌, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల్లో నెలకొన్న సమస్యలకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపాలే కారణమని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. స్థానిక సంస్థలను కాంగ్రెస్‌, భాజపాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన విజయాలు సాధిస్తుందని చెప్పారు. ఇక్కడి రైతులపై కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కోటిరెడ్డి విజయం ఖాయమని స్పష్టం చేశారు. జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, అభ్యర్థి కోటిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మాద ధనలక్ష్మి, మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ ఉమారాణి, పుర ఛైర్మన్‌ శ్రీనివాస్‌, తెరాస మండల శాఖ అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని