logo
Published : 04/12/2021 04:54 IST

నార్కట్‌పల్లి సర్పంచిపై సస్పెన్షన్‌ వేటు

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నార్కట్‌పల్లి సర్పంచి దూదిమెట్ల స్రవంతిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె భర్త షాడో సర్పంచిగా చలామణి అవుతూ అవినీతికి పాల్పడుతున్నారని, దొంగ బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేస్తున్నారని, పల్లె ప్రకృతి పనుల్లో అవినీతికి పాల్పడ్డారని వార్డు సభ్యులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.16,85,668 పంచాయతీ నిధులు ఖర్చు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్‌ అధికారులను విచారణకు పంపారు. నిబంధనలు పాటించలేదని స్పష్టం కావడంతో ఆరు నెలలు పాటు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని