Published : 04 Dec 2021 04:54 IST
ఐస్క్రీమ్ తయారీలో నిషేధిత రంగులు
రసాయనాలు పరిశీలిస్తున్న జిల్లా ఆహార భద్రత అధికారిణి వి.జ్యోతిర్మయి
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: మిర్యాలగూడ పట్టణంలోని పలు ఐస్క్రీమ్ తయారీ కేంద్రాలపై జిల్లా ఆహార భద్రత అధికారిణి వి.జ్యోతిర్మయి శుక్రవారం దాడులు నిర్వహించారు. కేంద్రాల్లో అపరిశుభ్రత, నిషేధిత రంగుల వాడకంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఓ కేం ద్రాన్ని తాత్కాలికంగా సీజ్ చేశారు. వారం రోజులు గడువు ఇస్తున్నామని.. ఆయినా తీరు మార్చుకోకపోతే శాశ్వతంగా సీజ్ చేస్తామ ని హెచ్చరించారు. ఆహార భద్రత, ట్రేడ్ లైసెన్సులను గడువులోగా రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. నిషేధిత రసాయనాలు, రంగులు కలిసిన పలు చిన్న పిల్లల పలు పదార్థాలను ధ్వంసం చేశామన్నారు. సిబ్బంది ఖాజా లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
నిషేధిత రంగులు కలిపిన ఐస్క్రీములు
Tags :