logo
Published : 04/12/2021 04:54 IST

ఆంగ్ల పాఠ్యపుస్తకంలో మల్లు స్వరాజ్యం చరిత్ర

డిగ్రీ తృతీయ సంవత్సరం పాఠ్యాంశంలో సాయుధ పోరాట యోధురాలి ప్రస్థానం

మిర్యాలగూడ, న్యూస్‌టుడే


డిగ్రీ ఆంగ్ల స్టడీ మెటీరియల్‌పై మల్లు స్వరాజ్యం చిత్రం

ఆంగ్లం సబ్జెక్టు అంటే ఇప్పటి వరకు ఆంగ్ల రచయితల పద్యాలు, విదేశీ పాఠ్యాంశాలు అక్కడి సామాజిక అంశాలు, అక్కడి వ్యక్తుల గురించి మాత్రమే ఉండేవి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటు నుంచి ఇక్కడ ప్రత్యేకంగా డిగ్రీ విద్యార్థులకు ఆంగ్ల సబ్జెక్టులో ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి సామాజిక అంశాలు, వ్యక్తుల గురించి పొందుపరుస్తున్నారు. డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు మొదటిసారిగా ఆంగ్ల సబ్జెక్టును ప్రవేశపెట్టారు. ఐదు, ఆరు సెమిస్టర్‌లలో ఆంగ్లం తప్పనిసరి చేశారు. ఈ ఏడాది ఐదో సెమిస్టర్‌ ఆంగ్ల పాఠ్యపుస్తకం సిలబస్‌లో ఉమ్మడి జిల్లా వాసి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గురించి వ్యాసం పొందుపర్చడం విశేషం.

సాయుధ పోరాటంలో మహిళా కమాండర్‌

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన మల్లు స్వరాజ్యం (1931లో జననం).. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. భూస్వాములు, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన మహోద్యమంలో తన భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి, సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారు. సాయుధ పోరాటంలో మహిళా కమాండర్‌గా పనిచేసిన మల్లు స్వరాజ్యం తలపై అప్పటి ప్రభుత్వం రూ.10 వేలు రివార్డు సైతం ప్రకటించింది. 11 ఏళ్ల వయసులోనే ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు తన కుటుంబానికి చెందిన భూముల్లోని ధాన్యం నిరుపేదలకు పంచారు. కార్మికుల వేతనాల గురించి, రైతుల సమస్యలపై ఆమె రాజీలేని పోరాటాలు సాగించారు. కమ్యూనిస్టు పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరైన ఆమె.. నల్గొండ పార్లమెంటు సభ్యురాలిగా సైతం పనిచేశారు.


మహిళలకు స్ఫూర్తి అవసరం

- మల్లు స్వరాజ్యం, మాజీ ఎంపీ

నాటి మహిళల వీరోచిత పోరాటాల గురించి నేటితరం మహిళలకు తెలియాల్సిన అవసరం ఉంది. పాఠశాల దశలోనే తెలుగులో పాఠ్యాంశంలో సాయుధ పోరాటం సాగించిన మాలాంటి వారి చరిత్ర పొందుపర్చాలి. నేను 16 ఏళ్ల వయసులోనే తుపాకీ చేతపట్టాను. నేటి మహిళల్లో ఆ స్ఫూర్తి నింపేందుకుగాను నాటి పోరాటాలను సమగ్రంగా తెలియజేయాలి. ఆధునిక పరిస్థితుల్లో మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని నా నమ్మకం. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వారు ఆంగ్లంలో నా గురించి పొందుపర్చటంతో ఆనందంగా ఉంది.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని