logo
Updated : 04/12/2021 13:41 IST

నవ్వడమే పాపం.. ఒళ్లంతా హూనం


వీపుపై వాతలు

మిర్యాలగూడ పట్టణం: నవ్వడమే ఆ విద్యార్థి చేసిన పాపమయ్యింది. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని బెల్టుతో కొట్టిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. బాధిత బంధవుల వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కుంకుడుచెట్టుతండాకు చెందిన పానుగోతు భాస్కర్‌-జయమ్మ కుమారుడు నాగేందర్‌.. మిర్యాలగూడలోని బీసీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తండ్రి ఇటీవల మరణించడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది. గురువారం రాత్రి స్టడీహవర్‌లో ఇతరులతో కలిసి నవ్వాడన్న కారణంగా పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జానీపాషా బెల్టుతో కొట్టడంతో నాగేందర్‌ మర్మాంగాలతో పాటు, వీపు, తొడలపై వాతలుపడ్డాయి. శుక్రవారం పాఠశాల వద్దకు వచ్చిన తల్లికి విషయం తెలపడంతో ఉపాధ్యాయుడిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ హాస్టల్‌ ముందు ధర్నా నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యుడైన అతిథి ఉపాధ్యాయుడు జానీపాషాను విధుల నుంచి తొలగించినట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎం.షకీనా ప్రకటించారు. పాఠశాలలో విద్యార్థులను కొట్టకుండా బోధించాలని ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు సూచిస్తున్నట్లు తెలిపారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని