logo
Published : 04/12/2021 04:54 IST

అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు, కుమారుడు దుర్మరణం


 శేఖర్‌రెడ్డి                      ధనమ్మ                    రఘుమారెడ్డి

లింగాలఘనపురం(రఘునాథపల్లి), న్యూస్‌టుడే: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన జనగామ-సూర్యాపేట రహదారి లింగాలఘనపురం మండలం వనపర్తి సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని పాపిరెడ్డికాలనీకి చెందిన జిన్న శేఖర్‌రెడ్డి(65) బావ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలకేంద్రానికి చెందిన సంకెపల్లి నర్సిరెడ్డి గురువారం మృతి చెందాడు. అంత్యక్రియలకు శుక్రవారం తెల్లవారుజామున శేఖర్‌రెడ్డి ఆయన భార్య ధనమ్మ(60), కుమారుడు రఘుమారెడ్డి(27)తో కలిసి కారులో బయలుదేరారు. జనగామ-సూర్యాపేట రహదారి మీదుగా వెళ్తుండగా బంజర గ్రామం క్రాస్‌ రోడ్డు వద్ద కారు టైరు పేలింది. దీంతో అదుపుతప్పి ఎదురుగా పశువుల లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయి శేఖర్‌రెడ్డి, ధనమ్మ, రఘుమారెడ్డి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారు నడుపుతున్న రఘుమారెడ్డి, పక్కనే కూర్చొని ఉన్న తండ్రి శేఖర్‌రెడ్డి ఒకరి ఒడిలో ఒకరు ఒరిగిపోయి మృతి చెంది ఉండటాన్ని చూసి స్థానికులు బోరున విలపించారు. ధనమ్మ వెనుక సీటులోనే మృతి చెంది కనిపించింది. పశువుల వాహనం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడేనికి చెందినదిగా గుర్తించారు. వాహనం డ్రైవర్‌ నరేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనంలోని ఐదు పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ రఘుచందర్‌ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

శేఖర్‌రెడ్డికి ధనమ్మతో పెళ్లయ్యాక సంతానం కలగకపోవడంతో రమణమ్మను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కొన్నాళ్లకు మొదటి భార్య ధనమ్మకు రఘుమారెడ్డి జన్మించారు. రెండో భార్య కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. రఘుమారెడ్డికి దివ్యతో ఏడాది క్రితమే వివాహమైంది. బుధవారమే వారి వివాహ వార్షికోత్సవం జరిపారు. శేఖర్‌రెడ్డి, రఘుమారెడ్డి మృతి చెందడంతో రమణమ్మ, దివ్య ఒంటరివారయ్యారు.

నుజ్జునుజ్జయిన కారు, వాహనం

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని