ఉపాధి లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయండి: డీఆర్డీవో
నేరేడుచర్లలో మాట్లాడుతున్న డీఆర్డీవో కిరణ్‌కుమార్, చిత్రంలో జడ్పీ సీఈవో సురేశ్, డీపీవో యాదయ్య, ఏపీడీ పెంటయ్య
నేరేడుచర్ల, న్యూస్‌టుడే: ఉపాధి పనుల లక్ష్యాలు సాధించేందుకు సిబ్బంది కృషి చేయాలని డీఆర్డీవో సుందరి కిరణ్‌కుమార్ సూచించారు. నేరేడుచర్లలో ఉపాధిహామీ, పల్లెప్రగతి పనుల తీరుపై నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పురోగతిని గురువారం నేరేడుచర్లలో నిర్వహించిన సమావేశంలో సమీక్షించారు. టీఏలు కస్టర్ల వారీగా మేట్లతో సమావేశాలు నిర్వహించి పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర, జిల్లా సగటులతో పోలిస్తే వెనుకబడి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిర్లిప్తంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వారం రోజుల్లో పురోగతి కన్పించాలన్నారు. జడ్పీ సీఈవో సురేశ్ మాట్లాడుతూ వైకుంఠదామాల పనుల్లో నేరేడుచర్ల ముందుందని, పాలకవీడులో ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పాలకవీడు మండలంలో ఒక కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. డీపీవో యాదయ్య మాట్లాడుతూ నేరేడుచర్ల మండలంలో ఇంటి పన్నుల వసూళ్లు కేవలం 14 శాతమే కావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీడీ పెంటయ్య, డీఎల్పీవో లక్ష్మినారాయణ, ఎంపీడీవోలు పి.శంకరయ్య, జానయ్య, ఎంపీవోలు విజయకుమారి, దయాకర్, ఏపీవోలు సురేశ్, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.