logo
Published : 04/12/2021 04:59 IST

విపక్షాలవి కుట్రపూరిత మోసాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: రైతులను కేసీఆర్‌ నుంచి దూరం చేయడానికే వెన్నెముక లేని కాంగ్రెస్‌, భాజపాలు కుట్రపూరిత మోసాలకు పాల్పడుతున్నాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, పుర కౌన్సిలర్లతో సమావేశం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్‌, భాజాపాలేనని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తమ ప్రభుత్వం ప్రారంభిస్తే.. భాజపా నాయకులు కేంద్రాల సందర్శన పేరిటా పర్యటిస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని కూడా కాలరాస్తున్న పార్టీ భాజపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా తెచ్చిన విద్యుత్తు చట్టం ప్రకారం ముందు డబ్బులు చెల్లిస్తేనే కరెంటు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెబుతుంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం వరి పండించండి రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని చెబుతుండటంతో విడ్డూరంగా ఉందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.సి. కోటిరెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీల, జడ్పీటీసీల, కౌన్సిలర్ల సమస్యలను మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బుర్రా సుధారాణి, రైతు సమన్వయ సమితి నియోజకవర్గ అధ్యక్షుడు సుంకరి అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని