logo

మహిళలు హక్కులను వినియోగించుకోవాలి

రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే సాధికారతను సాధిస్తారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆజాదీకా అమృత్‌

Published : 04 Dec 2021 17:16 IST

భువనగిరి: రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే సాధికారతను సాధిస్తారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా శనివారం మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన న్యాయసేవలపై అవగాహన సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళా చట్టాలపై పూర్తి అవగాహన కల్పించుకున్నప్పుడే జరుగుతున్న దాడులను ఎదుర్కోవచ్చన్నారు. జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం.భవానీ మాట్లాడుతూ.. రాజ్యాంగం దేశంలో పౌరులందరికి సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు కల్పించిందన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి పరిమళ, పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, మార్కెటింగ్‌ అధికారి సబిత, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని