logo

ధైర్యంగా ముందుకు సాగితేనే మహిళా సాధికారత

మగువలు తమ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలిక కార్యాలయంలోని

Published : 05 Dec 2021 03:19 IST


జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, చిత్రంలో జిల్లా అదనపు న్యాయమూర్తి భవాని, ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేణు, సీనియర్‌ సివిల్‌ జడ్జి రజని, జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, తదితరులు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: మగువలు తమ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పురపాలిక కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ మహిళా కమిషన్‌, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత, న్యాయసేవలపై’ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగి సాధికారత సాధించాలని సూచించారు. అతివలపై దురాగతాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యులు మగువల హక్కులను గౌరవించాలని, లింగ వివక్ష చూపకుండా అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని నల్గొండ జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం.భవాని తెలిపారు. చట్టాలపై అన్ని వర్గాలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు అన్నారు. చట్టాలపై పరిపూర్ణంగా ప్రజలకు అవగాహన లేని కారణంగా స్వాతంత్య్ర ఫలాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. మహిళా చట్టాలపై సీనియర్‌ సివిల్‌ జడ్జి రజని, జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు, రాజ్యాంగ హక్కులపై లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాది కేవీ రమణారావు అవగాహన కల్పించారు. సదస్సులో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, పలు శాఖల జిల్లా అధికారిణులు, పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగినులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోద శ్రీనివాస్‌, పలువురు సీనియర్‌ న్యాయవాదులు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, శిక్షణ ఎస్సైలు, మహిళా సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, డీఆర్‌డీఏ సహాయ మేనేజర్లు, పాల్గొన్నారు.

ప్రణాళికతో చదవండి: కలెక్టర్‌
భువనగిరి పట్టణం: ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్‌, ప్రధానోపాధ్యాయుడు జాన్సన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని